CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రెచ్చగొట్టే వారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు

Share it:

 


👉ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

👉సామాజిక సేవా కార్యక్రమాల్లో టీఆరెస్

యువజన విభాగం భాగస్వామ్యం కావాలి

👉టిఆర్ఎస్ పార్టీ మణుగూరు పట్టణ యువజన విభాగం జనరల్ బాడీ సమావేశంప్రభుత్వ విప్ రేగా కాంతారావు

మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,

మణుగూరు లోని పద్మశాలి భవన్ లో మణుగూరు పట్టణ యువజన అధ్యక్షులు రుద్ర వెంకట్ అధ్యక్షత న టిఆర్ఎస్ పార్టీ మణుగూరు పట్టణ యువజన విభాగం జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ, కరోనా కారణంగా కొంత గ్యాప్ రావడం జరిగుందన్నారు.పార్టీ కార్యక్రమాలు ప్రభుత్వం చేసే అభివృద్ధి ని సమానంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అన్నారు.ప్రతిపక్షాల విమర్శలను సున్నితంగా తిరస్కరించాలి అన్నారు. రాజ నీతి పాటించాలి అని, రచ్చగొట్టే వారు మాటలను పట్టించువద్దు అని,క్రమశిక్షణ తో నడుచుకోవాలన్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అన్నారు.పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని,మన లక్ష్యం వైపు అడుగులు వేయాలని, భవిష్యత్ కార్యాచరణ పై యువతకు దిశ నిర్ధేశం చేశారు.జడ్పీటీసీ పొశం. నర్సింహారావు మాట్లాడుతూ,భవిష్యత్ రాజకీయాల లో యువత ముఖ్య పాత్ర పోషించాలి అన్నారు.ప్రభుత్వ పథకాల ను ప్రజలలోకి తీసుకొని వెళ్లాలని,వివిధ రంగాలలో, ఉన్న యువత ఒకే తాటి పైకి వచ్చే విధంగా కృషి చేయాలన్నారు.పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు పట్టుదలతో పనిచేయాలన్నారు.ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీసీబీ డైరెక్టర్ తుళ్ళూరి. బ్రహ్మయ్య మాట్లాడుతూ తెలంగాణ లోని అన్ని నియోజకవర్గాల్లో కన్న పినపాక నియోజకవర్గం విప్ రేగా కాంతారావు కృషి తో నియోజకవర్గం పారిశ్రామికం గా అభివృద్ధి చెందుతుందని అన్నారు.ఇప్పటికే అనేక అబివృద్ది పనులు జరుగుతున్నాయి అని,ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయి అన్నారు. విప్ రేగా కాంతారావు ప్రత్యేక కృషి తో బిటిపిఎస్ లో భూ నిర్వాసితులకు శాశ్వత ఉద్యోగాలు కల్పించారు అని గుర్తు చేశారు.యువత చెడు వ్యసనాలకు బానిసలు కావొద్దని సూచించారు,వారి అనుభవాన్ని యువతతో పంచుకున్నారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు,నియోజకవర్గ యువజన అధ్యక్షులు సాగర్ యాదవ్,యువజన నాయకులు,టిఆరేస్వి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: