CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పేద ప్రజల సంక్షేమమే టిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం

Share it:

 



రూ.24,02,784 రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ: మణుగూరు ప్రజా ప్రతినిధులు,అధికారులు


మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరు ఐన కళ్యాణ లక్ష్మీ చెక్కులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు మణుగూరు మండల ప్రజా ప్రతినిధులు,అధికారులు  మొత్తం 24 మంది లబ్ధిదారులకు రూ.24,02,784 రూపాయల విలువ గల చెక్కులను వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా జడ్పీటీసీ పొశం.నర్సింహారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కల్యాణలక్ష్మి పధకం ద్వారా పేద ఇంటి ఆడపిల్లల కు కానుకగా రూ.1,00,116 విలువ గల చెక్కును కులాలకు,మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం అందజేస్తుంది అన్నారు.దేశం లో ఎక్కడ లేని విధంగా తెలంగాణ లో సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలుచేస్తు, బంగారు తెలంగాణ నిర్మాణానికి కృషి చేస్తున్నారు అని అన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు.ఈ సందర్భంగా చెక్కులను అందుకున్న లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ,సీఎం కేసీఆర్ కు,ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మణుగూరు జడ్పీటీసీ పొశం.నర్సింహారావు,పీఏసీఎస్ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,జూనియర్ అసిస్టెంట్ ముద్దరాజు, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి నవీన్,మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,పట్టణ యువజన అధ్యక్షులు రుద్ర వెంకట్,టిఆర్ఎస్ పార్టీ నాయకులు,ముద్దంగుల.కృష్ణ,ఎడ్ల.శ్రీను,వేముల.లక్ష్మయ్య,హరి ప్రసాద్,పార్టీ  కార్యకర్తలు,యువజన నాయకులు,స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: