మన్యం టీవీ మంగపేట.
ఎక్కటి సరోజనీ శేషారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల, మంగపేట చుట్టూ ప్రహరీ గోడ లేక పోవడం వల్ల ఎదురౌతున్న ఇబ్బందులు, సమస్యలను మన కలెక్టర్ శ్రీ కృష్ణ ఆదిత్య కు ప్రాతినిధ్యం చేసిన వెంటనే స్పందించి మన కళాశాలకు రక్షణ వలయము నిర్మాణము కొరకు ₹ 32-00 లక్షలు మంజూరు చేసినారు. మన కళాశాలకు శాశ్వత ప్రాతిపదికన ప్రహరీ గోడ నిర్మాణమునకు నిధులు మంజూరు చేసిన మన కలెక్టర్ శ్రీ కృష్ణ ఆదిత్య కు అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ప్రహరీ గోడ నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని ఆదేశించడముతో కాంట్రాక్టర్ నిర్మాణ పనులను కొబ్బరి కాయలు కొట్టి ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమం లో పాల్గొన్నవారు ప్రిన్సిపాల్ గూళ్ల వెంకటయ్య, అధ్యాపక బృందం మరియు విద్యార్థులుతదితరులు పాల్గొన్నారు.
Post A Comment: