CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అంగన్వాడి టీచర్లకు పలు అంశాలపై అవగాహన సమావేశం

Share it:

 


మన్యం మీడియా/అన్నపురెడ్డిపల్లి(జులై 31):: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అన్నపురెడ్డిపల్లి మండలం, ఎర్రగుంట సెక్టర్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల టీచర్లకు, అంగన్వాడి సూపర్వైజర్ గంగాజలం ఆధ్వర్యంలో కొండాయిగూడెం గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సిడిపిఓ)-సిహెచ్ నిర్మల జ్యోతి హాజరై, అన్ని అంగన్వాడీ కేంద్రాల రికార్డులను పరిశీలించారు. సిడిపిఓ-నిర్మల జ్యోతి మాట్లాడుతూ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి దోహదపడే సాటిలైట్ కమ్యూనికేషన్ అయినా టీ సాట్ ప్రోగ్రాములను అంగన్వాడీ టీచర్లు వీక్షించాలని తెలియజేశారు. అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్న టేక్ హోమ్ రేషన్ (టిహెచ్ఆర్) డిస్ట్రిబ్యూషన్, అంగన్వాడి సెంటర్స్ క్లీనింగ్, న్యూట్రీ గార్డెన్ తదితర అంశాలపై అంగన్వాడి టీచర్లకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎర్రగుంట సెక్టార్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల టీచర్లు అందరూ పాల్గొన్నారు.

Share it:

Post A Comment: