CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సీతంపేట నిరుపేద యువకునికి రేగా సాయం

Share it:

 



మన్యం మనుగడ, పినపాక:


 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం సీతంపేట పంచాయతీకి చెందిన గుండారపు ప్రశాంత్ అనే నిరుపేద యువకుడు అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావుకు పినపాక మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి స్వయంగా హైదరాబాదులోనే తెలియజేయగా, వెంటనే స్పందించిన రేగా కాంతారావు ఆ యువకుడికి వైద్య ఖర్చుల నిమిత్తం లక్ష రూపాయలను ఆర్థిక సాయంగా అందించడం జరిగింది. ఆర్థిక సాయం పొందిన గుండారపు ప్రశాంత్, తన పరిస్థితిని గమనించి వెంటనే ఆర్థిక సహాయం చేసిన రేగా కాంతారావుకు జన్మజన్మలకు ఋణపడి ఉంటానని అన్నాడు.

ఈ కార్యక్రమంలో సీతంపేట పంచాయతీ ఉప సర్పంచ్ కొండేరు నాగభూషణం, పినపాక లైన్స్ క్లబ్ వ్యవస్థాపకులు, సామాజిక సేవకుడు ముక్కు వెంకట నర్సారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: