CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రైతుల ఆశీస్సులతో ఈ స్థాయికి ఎదిగా - డీసీఎంస్ వైస్ చైర్మన్ కొత్వాల

Share it:

 మన్యం టీవీ పాల్వంచ:-


జిల్లా రైతులు, సొసైటీ సభ్యుల ఆశీస్సులతో జిల్లా స్థాయికి ఎదిగానని *డీసీఎంస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు* అన్నారు. ఖమ్మంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (DCCB) మహాజన సభ నిర్వహించారు. ఈ సందర్బంగా *భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉత్తమ సొసైటీ అధ్యక్షునిగా ఎంపికైన కొత్వాల శ్రీనివాసరావు* తో పాటు ఖమ్మం జిల్లా ఉత్తమ సొసైటీ అధ్యక్షునిగా ఎంపికైన *బీరెడ్డి నాగచంద్రారెడ్డిని డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం* తో పాటు *మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్,* జిల్లా కు చెందిన 100 మంది సొసైటీ అధ్యక్షులు DCCB, DCMS పాలకవర్గాలు ఘనంగా సన్మానించాయి.ఈ సందర్బంగా పాల్వంచలో శనివారం జరిగిన సమావేశంలో *కొత్వాల* మాట్లాడుతూ మూడు సార్లు పాల్వంచ సొసైటీ అధ్యక్షునిగా, 16 సంవత్సరాల నుండి రైతులు సొసైటీ సభ్యులు తనను ఆదరిస్తున్నారన్నారు. డీసీసీబీ డైరెక్టర్ గా 7 సం"లు, కొత్తగూడెం మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా, ఇప్పుడు డీసీఎంస్ వైస్ చైర్మన్ గా జిల్లాలోని రైతాంగం తనను ఆశీర్వదిస్తున్నందుకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. తన జీవితాంతం వరకు రైతులకు సేవ చేయటమే ద్యేయంగా రైతు సేవ చేస్తానన్నారు. 2018 సం"లో పాల్వంచ సొసైటీని తెలంగాణా రాష్ట్రంలోనే ఉత్తమ ద్వితీయ సొసైటీగా ఎంపిక చేసి షీల్డ్ తో పాటు 20 వేల నగదు అవార్డు* ఇచ్చారన్నారు. , 2021 సంవత్సరం లో భద్రాద్రి జిల్లా ఉత్తమ అధ్యక్షునిగా తనను ఎంపికచేసినందుకు ప్రభుత్వానికి, *ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు* కి ప్రత్యేక కృతజ్ఞతలతో పాటు ధన్యవాదాలు తెలిపారు.

Share it:

Post A Comment: