CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అభయహస్త ఫౌండేషన్ లెర్నింగ్ సెంటర్లలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని చింతలమోరి గుత్తికోయ గ్రామం,గోవిందరావుపేట మండలంలోని టేకులకుంట గుత్తికోయ గ్రామంలో అభయహస్త ఫౌండేషన్ లెర్నింగ్ సెంటర్లలో  ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని విద్యార్థులు మరియు వారి కుటుంబాల సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరిగినది. మొదట కొమురం భీం, బిర్స ముండ,అంబెడ్కర్, గార్ల చిత్రపటానికి పూలమాలవేసి నివాళ్లు అర్పించించి విద్యార్థులకు మిఠాయిలు పంచడం జరిగినది.ఈ సందర్భంగా ఫౌండేషన్ టీచర్లు మాట్లాడుతూ ఆదివాసీ దినోత్సవ ఆవశ్యకతను విద్యార్థులకు మరియు వారి కుటుంబాలకి తెలియచేస్తూ, ఆది నుండి ప్రకృతిని, పర్యావరణాన్ని, జంతుసంతతిని,అడవిలోని వనరులని ఆదివాసీలు సంరక్షించుకుంటూ వస్తున్నారని,అలానే ఆదివాసీలకు ప్రభుత్వాలు ఎన్నో హక్కులు కల్పించిందని అందులోని ప్రధానమైనవి అడవి వనరులపైనా హక్కు, విద్య,వైద్యం లాంటి అంశాలను ప్రస్తావించడం జరిగింది.అలానే విద్యయొక్క ప్రాముఖ్యతను గుత్తికోయలకు తెలియపరచి,విద్యావంతులై ఎలా ఆదివాసీల హక్కులను సంరక్షించుకోగలమో తెలియచేయటం జరిగినది.కొమురం భీం,బిర్స ముండ చేపట్టిన జల్ జంగిల్ జమిన్ ఉద్యమం విశేషాలను విద్యార్ధులకి తెలియపర్చడం జరిగినది.ఈ సందర్భంగా ఆదివాసీ,గిరిజన బిడ్డలకు ముఖ్యంగా ములుగు జిల్లా ప్రజానీకానికి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.కార్యక్రమంలో అభయహస్త ఫౌండేషన్ ములుగు జిల్లా కోఆర్డినేటర్ నిఖిల్,టేకులకుంట అభయహస్త ఇంచార్జ్ మౌనిక, కళ్యాణ్,గుత్తికోయ కుటుంబాలు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: