CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉ఉర్దూ ఘర్ - షాదిఖాన చైర్మన్ గా షేక్ అన్వర్ పాషా

Share it:


భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 31 (మన్యం టీవీ) ఉర్దూ ఘర్ మరియు షాదిఖాన కమిటీ నియామక పత్రాన్ని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకేటేశ్వరావు మంగళవారం ఆయన స్వగృహంలో చైర్మన్, కమిటి సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉర్దూఘర్ , షాదిఖాన అభివృద్ధితో పాటు అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందేలా పని చేయాలని, అందరిని కలుపుకుని వెళ్తూ ప్రజల మనస్సులో పేరు తెచ్చుకోవాలని, ఉర్దూ ఘర్ అభివృద్ధి కోసం కావాల్సిన నిధులను తెప్పించే ప్రయత్నంలో తన వంతుగా తోడ్పాటును అందిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే వనమాను కమిటీ సభ్యులు సన్మానించారు. ఉర్దూ ఘర్ , షాదిఖాన చైర్మన్ గా షేక్ అన్వర్ పాషా, కోఆర్డినేటర్ గా 22వ వార్డు ఎండి యాకుబ్ పాషా, సభ్యులుగా ఎంఏ కమ్రాన్,ఎండి మజీద్,ఎస్డీ జానీ హుస్సేన్, ఎండి జరీనా, ఎస్డీ జానీ, ఎంఏ ఖయ్యుం నియమితులయ్యారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తమ మీద నమ్మకంతో తమకు ఇచ్చిన భాద్యతల నిర్వహణలో ప్రజలకు సేవా కార్యక్రమాలు అందిస్తామని, తమకు అవకాశం అందించిన వనమా రాఘవేంద్రరావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Share it:

Post A Comment: