CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రుణమాఫీ కి సంబంధించిన పత్రాలను కార్యాలయంలో ఇవ్వండి

Share it:

 


ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ 

రవివర్మ


మన్యం మనుగడ, పినపాక:



పినపాక, కరకగూడెం మండలాలలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ రైతులకు,ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ రవి వర్మ కొన్ని సూచనలను చేశారు. తెలంగాణ  ప్రభుత్వం సహకార సంఘం నుండి రుణాలు పొందిన రైతులందరికీ రూ.50000/- లోపు రుణాలు ఉన్న వారికి, మాఫీ ప్రకటించిన ఈ విషయాన్ని రైతులు అందరు గమనించాలి అని, ఈ విధంగా తెలియజేశారు. పినపాక ప్రాథమిక వ్యవసాయ సహకారసంఘంలో రుణాలు పొందిన రైతులు, పుస్తకం జిరాక్సు, ఆధార్ కార్డు జీరాక్స్ తో పాటుగా, రైతుకు సంబంధించిన ఫోను నెంబరు తప్పనిసరిగా సంఘ కార్యాలయంలో ( ఆఫీసు లో) ఇవ్వగలరు అని తెలియజేశారు. శనివారం, ఆదివారం లలో ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్డులోని సహకార సంఘం కార్యాలయంలో పత్రాలను సమర్పించి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Share it:

Post A Comment: