CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు భూముల పట్టాలు ఇప్పించండి

Share it:

 


*ఫారెస్ట్ అధికారులతో దాడులు చేపించడం సరికాదు

*పొడుభూములపై ప్రభుత్వం వైఖరి ఏమిటో తెలియజేయాలి

*రైతుల పక్షాన పోరాటానికైనా కాంగ్రెస్ పార్టీ సిద్ధం


*కాంగ్రెస్ పార్టీ కిసాన్ సేల్  మండల అధ్యక్షుడు చౌలం వెంకటేశ్వర్లు

మన్యం టీవీ మంగపేట.

మంగపేట మండలంలోని  శనిగకుంట,రాజుపేట ఫారెస్ట్ బీట్  పరిధిలోని పొడు భూముల్లో హరితహారం మొక్కలను నాటడానికి వచ్చిన ఫారెస్ట్ అధికారులను,జేసీబీని శనివారం రోజున పోడు రైతులతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు కిసాన్ సెల్  మండల అధ్యక్షుడు చౌలం వెంకటేశ్వర్లు,యువజన కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి కర్రీ నాగేంద్రబాబు కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొడుభూములు కోసం ప్రజలకు  ఫారెస్ట్ అధికారులకు కయ్యం పెట్టి కూర్చున్నది ప్రభుత్వం, పోడు భూములపై ప్రభుత్వం వైఖరి ఏమిటో తెలియజేయాలి లేదంటే ప్రజాఉద్యమాలు చేస్తాము, ప్రతి ఇంటినుండి ఆడ మగ, చిన్న, పెద్ద, ముసలి ముతక అందరూ దండు లా కదిలి ఉద్యమిస్తాము. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో పోడు రైతులకు పట్టాలు ఇస్తానని చెప్పి ఇప్పుడు రైతులను ఇబ్బందులకు గురిచేస్తు వారి పై దాడి చేపిస్తున్నారని ఈ సందర్బంగా ఆరోపించారు.పోడు రైతులకు గత కాంగ్రెస్ ప్రభుత్వం  అడవి హక్కుల పట్టాలు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పట్టాలు చెల్లవని భూములు ప్రభుత్వానికీ సంబంధించిన భూములు అనడం విడ్డురంగా ఉందని చౌలం వెంకటేశ్వర్లు గారు అన్నారు.2004 సంవత్సరం పూర్వం సాగు చేస్తున్నటువంటి భూములపై ఫారెస్ట్ అధికారులు దాడులు చేయడం సరైనది కాదని అన్నారు.  ఇట్టి విషయం లో తెరాస ప్రభుత్వం బాధ్యత వహించాలి అని ఎన్నికల ముందు ఎస్సీ ఎస్టీ ఓట్లను మూడు ఎకరాల భూమి పోడు భూముల పట్టాలు ఇస్తానని చెప్పి అధికారం లోకి వచ్చాక పారెస్ట్ అధికారులతో దాడులు చేపించి అట్టి భూములు లాక్కోవడం  సరికాదు అని అన్నారు..ఎట్టి పరిస్థితుల్లోనూ పోడు భూములను వధులుకునేది లేదని అవసరం అయితే రైతుల పక్షాన నిలబడి ప్రభుత్వం పై కాంగ్రెస్ పార్టీ తరుపున ఉద్యమాలు,పోరాటాలు చేయటనికైనా సిద్దమని ములుగు జిల్లా యువజన కార్యదర్శి కర్రీ నాగేంద్రబాబు గారు అన్నారు.

Share it:

Post A Comment: