CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అనంతలో కదంతొక్కిన జర్నలిస్టులు

Share it:

 



అక్రిడేషన్లు సాధనకై మచ్చా రామలింగారెడ్డి నిరసన దీక్షకు భారీగా తరలివచ్చిన జర్నలిస్టులు

==================


జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులందరికి అక్రిడేషన్లు ఇస్తాం కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్


వారం పది రోజుల్లో సమావేశాన్ని నిర్వహించి అక్రిడేషన్లు ఇస్తాం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి


జిల్లాలోని జర్నలిస్టులకు అండగా ఉంటాం కలెక్టర్ నాగలక్ష్మి

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, A.P.W.J.U

మన్యం మనుగడ వెబ్ డెస్క్:


👉రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై ఈ రోజు అనంతపురం నగరంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో మచ్చా రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల నిరసన దీక్ష కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ వెంకటేశ్వర్లు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున జర్నలిస్టులు తరలివచ్చారు 

రాష్ట్రంలో ఎదుర్కొంటున్న సమస్యలు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి వివిధ అంశాలుతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ ద్వారా కోరారు.


👉రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ అక్రిడేషన్ ఇవ్వాలని 


👉చిన్న పత్రికలకు GSTతో సంబంధం లేకుండా అక్రిడేషన్లు ఇవ్వాలని కోరారు. 


👉అక్రిడేషన్ తో సంబంధం లేకుండా జర్నలిస్టులకు హెల్త్ కార్డు బీమా సౌకర్యం కల్పించాలని ఇతర సమస్యలు ముఖ్యమంత్రి చొరవ చూపి పరిష్కరించాలని వినతిపత్రం కలెక్టర్ కి అందజేశారు వినతిపత్రాన్ని ముఖ్యమంత్రికి పంపించాలని కోరారు.  


👉గతంలో ఎన్నడూ లేనివిధంగా జిల్లా నలుమూలల నుంచి జర్నలిస్టులు మచ్చా రామలింగారెడ్డి సంఘీభావంగా తరలివచ్చారు. 


👉నిరసన దీక్ష అనంతరం మచ్చా రామలింగారెడ్డి వెంకటేశ్వర్లు, ఫారుక్ ఇతర జర్నలిస్ట్ యూనియన్ నాయకులు జిల్లా కలెక్టర్ కుమారి నాగలక్ష్మి సెల్వరాజన్ కలిసి జర్నలిస్టుల సమస్యలపై వివరించారు. 


👉జిల్లాలో సూర్య, ఆంధ్రప్రభ, ఈనాడు ఇతర ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు అక్రిడేషన్లు మొదటిలో రాలేదని వెంటనే వారందరికీ ఆక్సిడేషన్లు ఇవ్వాలని మచ్చా రామలింగారెడ్డి కలెక్టర్ ను కోరారు 


👉జిల్లాలోని చిన్న పత్రికలకు GSTతో సంబంధం లేకుండా నిజమైన వర్కింగ్ జర్నలిస్టులందరికి కూడా ఆక్సిడేషన్ ఇవ్వాలని జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరారు జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్యను అందించాలని గత పదేళ్లుగా పైగా జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నారని అది కొనసాగించాలని కోరారు. 


👉కొడిమి జర్నలిస్ట్ కాలనీను అభివృద్ధి చేయాలని కలెక్టర్ కు మచ్చా వివరించారు 


👉అనంతరం కలెక్టర్ కుమారి నాగలక్ష్మి సెల్వరాజన్ మాట్లాడుతూ వారం పది రోజుల్లో మరలా సమావేశాన్ని నిర్వహించి జిల్లాలో మిగిలిపోయిన నిజమైన వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడేషన్లు మంజూరు చేస్తామని జర్నలిస్టులకు అండగా ఉంటామని కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ అన్నారు.


👉అనంతపురం నగర జర్నలిస్టుల కొడిమి జర్నలిస్టుల కాలనీ అభివృద్ధికి సహకరిస్తామని జిల్లాలో వర్కింగ్ జర్నలిస్టులు అందరికి కూడా జిల్లా యంత్రాంగం తరపున పూర్తిగా అండగా ఉంటామని జిల్లా కలెక్టర్ కుమారి నాగలక్ష్మి అన్నారు.


👉 ఈ నిరసన కార్యక్రమంలో విజయరాజు, భాస్కర్ రెడ్డి, జానీ, బాలు, శ్రావణ్, ఫరూక్, మల్లికార్జున, రామాంజనేయులు, కుల్లాయస్వామి, చలపతి, సాయిరాం, ఉపేంద్ర, షకీర్, దాదు, శ్రీకాంత్, హనుమంతు రెడ్డి, మల్లి, సాయి, శేఖర్, నాగేంద్ర, షాహనాజ్, మస్తాన్ వలి, మన్సూర్ భాషా, లేపాక్షి గురుమూర్తి, 

నాగేంద్ర, పుట్టపర్తి మురళీకృష్ణ, ఓబుళపతి కృష్ణమూర్తి తదితర జర్నలిస్టులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

Share it:

Post A Comment: