CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు

Share it:

 


మన్యం టీవి, మణుగూరు:

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశమైన... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్& పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు 

 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.

 జెండా పండుగ నుంచి పార్టీ కమిటీల సందడి.

 పార్టీలో జెండా పండుగ నుంచి కమిటీల సందడి ప్రారంభం కానున్నది.

ఈ కమిటీల ప్రక్రియను చేపట్టేందుకు అవసరమైన సన్నాహక సమావేశాలు అన్ని మండల కేంద్రాల్లో 2వ తేదీన జెండా పండుగ ను నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని అన్నారు.

 సెప్టెంబర్ 2న పినపాక నియోజకవర్గంలోని 118 గ్రామ పంచాయితీలలో జెండా పండుగ తో పాటు అదే రోజు నుంచి గ్రామ కమిటీ ల నిర్మాణం మొదలవుతుంది..

 సెప్టెంబర్ 2 నే ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి కేసీఆర్ గారు శంకుస్థాపన చేస్తారు..దానికి మేమంతా హాజరవుతున్నాం..

 సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు గ్రామ, వార్డు కమిటీ లు వెయ్యాలి.

 సెప్టెంబర్ 12 నుంచి 20 వరకు మండల కమిటీ లు పూర్తి చేయాలి.

 సెప్టెంబర్ 20 తర్వాత జిల్లా కమిటీ ల నిర్మాణంలో అందరి భాగస్వామ్యం వుండాలి ...

 అన్ని కమిటీ లలో మహిళల తో పాటు SC,ST, BC, మైనార్టీ వర్గాలకు చెందినవారు వారు నిర్దేశించిన విధంగా ఆయా కమిటీలలో స్థానం కల్పించాల్సిదే ఈ నేపథ్యంలో కమిటీలను ఏర్పాటు చేసే సమయంలో ఈ జాగ్రత్తలను విధిగా పాటించాలని సూచించారు.

పార్టీ కమిటీలతో పాటు, పార్టీకి అనుబంధంగా విద్యార్థి, యువజన, కార్మిక, మహిళా, రైతు విభాగాల కమిటీలను కూడా ఏర్పాటు చేయనున్నామన్నారు.

వీటితోపాటు సోషల్ మీడియా మండల,పట్టణ కమిటీలు ఏర్పాటు చేయాలి అన్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా డిసిసిబి డైరెక్టర్ శ్రీ తుళ్లూరి బ్రహ్మయ్య , ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ అన్ని మండల అధ్యక్షులు, టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: