CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కులం ముసుగు లో ప్రశ్నించే గొంతుక పై విమర్శలు చేయడం సరికాదు

Share it:

 


 -యువజన కాంగ్రెస్ జిల్లా నాయకులు కర్రీ నాగేంద్రబాబు.

మన్యం టీవీ మంగపేట.


 అన్ని వర్గాల నాయకురాలిగా మన్ననలు అందుకుంటున్న ములుగు ఎమ్మెల్యే సితక్క ని విమర్శించే స్థాయి మాల మహానాడు ములుగు జిల్లా అధ్యక్షులు కర్రీ శ్యాంబాబు కు లేదని ఆయన అన్నారు ఎమ్మెల్యే సితక్క ని ఒక వర్గానికే నాయకురాలు గా చిత్రీకరించడం సరైన పద్ధతి కాదని మాల మహానాడు జిల్లా అధ్యక్షులు కర్రీ శ్యాంబాబు స్థాయి కి తగ్గ మాటలు మాట్లాడాలి అని ఆయన పద్ధతి మార్చుకోవాలని అని సూచించారు. తెరాస ప్రభుత్వం ఇచ్చిన హామీల గూర్చి అసెంబ్లీ సమావేశల్లో దళితులకు మూడు ఎకరాల భూమి,డబుల్ బెడ్రూం ఇళ్లు, ఇవ్వాలి అని తెరాస ప్రభుత్వా న్నీ నిలదీసి ఇచ్చిన హామీలను అమలు చేయాలి అని అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు అని గుర్తుచేశారు. ములుగు జిల్లా గా ప్రకటించిన్నప్పుడు ములుగు ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానాని మాట ఇచ్చిన కేసీఆర్ ఇంతవరకు నిధులు ఇవ్వకుండా మభ్యపెడుతున్న ములుగు జిల్లా కు చెందిన ఒక మాల మహానాడు సంగం నాయకులు ఎందుకు స్పందించడం లేదు అని అన్నారు. ఇప్పటికైనా జిల్లా అధ్యక్షులు మేల్కొని అధికార పార్టీ ముసుగును తొలగించుకొని తప్పుడు ప్రకటన ఇవ్వడం దళితులను మోసం చేస్తున్న కేసీఆర్ గ ఇచ్చిన హామీలను ప్రభుత్వంతో కొట్లాడి దళితుల అభివృద్ధికి కృషి చేయాలి అని సూచించారు. సీతక్క ని విమర్శించే స్థాయి ఎవరికి లేదని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్యరాజన్ సైతం కరోన కాలం లో అక్క చేసిన సేవకు హ్యాండ్సఫ్ సితక్క అని అన్నారు. ప్రజా నాయకురాలు గా దేశ వ్యాప్తంగా పెరుగాంచిన సీతక్క ని విమర్శిస్తే ఊరుకునేది లేదని యువజన నాయకులు కర్రీ నాగేంద్రబాబు ఈసందర్బంగా పత్రిక ప్రకటన ద్వారా పేర్కొన్నారు.

Share it:

Post A Comment: