CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దళిత సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు నిరసన.

Share it:

 


మన్యం టీవీ,కొత్తగూడెం ఆగస్టు 9:-

సోమవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దళిత సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న టువంటి దళిత బంధు పథకం  హుజురాబాద్ బై  ఎలక్షన్ల కంటే ముందే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేద దళితులు అందరికీ ఒకేసారి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో అమలు చేయాలని జాతీయ,రాష్ట్ర,దళిత సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం బస్టాండ్ సెంటర్ నుంచి జిల్లాకలెక్టర్ కార్యాలయం వరకు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతూ జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ ని కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో  మాల మహానాడు జిల్లా అధ్యక్షులు పూల రవీందర్ మాట్లాడుతూ దళిత బంధు పథకం దేశానికి ఆదర్శం అని చానా బృహత్తర కార్యక్రమం కానీ ఇది తెలంగాణ ప్రభుత్వం హుజురాబాద్ ఎలక్షన్లకు పావుల వాడుకోవడం కాకుండా చిత్తశుద్ధితో రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేద దళితులు అందరికీ వర్తింపజేసి దళితుల మన్ననలను పొందాలని లేకపోతే దళితుల ఆగ్రహానికి బలికాక తప్పదు అని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. అడగందే అమ్మయినా అన్నం పెట్టదు కానీ కేసీఆర్ ప్రభుత్వం దళితులు అడగకుండానే ఈ పథకం అమలు చేయడం హర్షించదగ్గ విషయమని కానీ మునుపు ఇచ్చిన హామీల మాదిరిగా దళిత ముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాల భూమి, ఇలా దళితులకు ప్రకటించిన పథకాలన్నీ, పత్రికా ప్రకటనలు, వార్తలకు,పరిమితం కాకుండా ఈ దళిత బంధువు పథకమైనా, చిత్తశుద్ధితో అమలు చేయాలని. దీని యొక్క విధి విధానాలు హుజురాబాద్ బై ఎలక్షన్ కు ముందే ప్రకటించాలని డిమాండ్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు సుబ్బారావు మధుసూదన్( చిన్ని), భూపతి అశోక్, నాగేందర్ ( బూసి), గుడివాడ రాము, మాట్లాడడం జరిగింది.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాదళిత నాయకులు రామ్ చందర్ (అశోక్),రవి కిరణ్, ఇళ్ల మోహన్, కవల నాగేష్, ఎన్. వెంకటేష్, వి వి జి కృష్ణ, కె.సురేష్ కుమార్, పి.సురేష్, కే.నగేష్, పి. శ్రీకాంత్, ఎ.శ్రీనివాస్, టి.రవి రాజు, బీరా అజయ్, కె.లింగయ్య, గుల్ల ఈశ్వర్, బి.కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: