CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కాంగ్రెస్ నాయకుల విమర్శలు అర్ధరహితం: టిఆర్ఎస్ పట్టణ యువజన అధ్యక్షులు రుద్ర వెంకట్

Share it:

 



మన్యం టీవీ మణుగూరు: ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాలతో నియోజకవర్గంలోని అన్ని పంచాయతీలలో ఫాగింగ్, డ్రైడే,ఫ్రైడే ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ ప్రజలకు విషజ్వరాల పట్ల అప్రమత్తం చేస్తూ,వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు మీద అర్థరహిత వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదం అని, దీన్ని టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం అని టీఆర్ఎస్ పార్టీ పట్టణ యూత్ అధ్యక్షుడు రుద్ర వెంకట్ విమర్శించారు. స్థానిక టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతు పినపాక నియోజకవర్గ అభివృద్ధి కొరకు నిరంతరం శ్రమిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర అత్యధిక నిధులు సేకరిస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ని విమర్శించడం చాలా దారుణం అని ఈ సందర్భంగా వారి విమర్శలను తీవ్రంగా ఖండించారు.ఈ కార్యక్రమం లో టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి తురుక.రామకోటి, ఉపాధ్యక్షులు అన్నదేవర శివ,సృజన్,ఎం.అశోక్,ఏ ప్రవీణ్,సూర మధు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: