CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఐ టి సి తో బంగారు భవిష్యత్...

Share it:




మన్యం టీవీ : జూలూరుపాడు,

ఆగస్టు 6, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లోని నల్లబండ బోడు గ్రామంలో ఐటీసీ వారి సహకారంతో జూలూరుపాడు మండల ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్( జూలూరుపాడు మండల రైతుల ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్)ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా మిరప మరియు కూరగాయల కు సంబంధించిన నర్సరీని ఐటిసి ప్రాజెక్ట్ మేనేజర్ సాయికిరణ్ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం సాయి కిరణ్ మాట్లాడుతూ.. మన జిల్లాలో ఐటీసీ ద్వారా మొదటిగా జూలూరుపాడు మండలం లోని నల్ల బండ బోడు గ్రామంలో ఎఫ్ పి ఓ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. మున్ముందు మరిన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అందరూ సమిష్టిగా ముందుకు సాగాలని కోరారు. జూలూరుపాడు ఎప్ సి ఎల్ అధ్యక్షులుగా బచ్చల లక్ష్మయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మయ్య మాట్లాడుతూ.. ఈ కంపెనీకి 115 మంది వాటాదారుల ను తీసుకోవడం జరిగిందని తెలిపారు. రానున్న కాలంలో ఎన్ ఏ బి ఏ ఆర్ డి, మరియు ఐఎఫ్ఎస్సి, ద్వారా ఇంకా నిధులు పెంచుకొని మా యొక్క ఎప్ సి ఎల్ ని అభివృద్ధి పరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా, హేమంత్, ధాన్ ఫౌండేషన్ నుండి అలీ, మునీర్, వినయ్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: