CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అశ్వారావుపేటలో ప్రారంభమైన పోడు సాగు దారుల పోరు యాత్ర

Share it:

  •  

  • అశ్వారావుపేటలో ప్రారంభమైన పోడు సాగు దారుల పోరు యాత్ర 
  •  హాజరైన న్యూ డెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు 


 మన్యంటీవీ, అశ్వారావుపేట: 

అటవీ హక్కుల చట్టం ప్రకారం ప్రతి ఆదివాసి కుటుంబానికి మరియు ప్రతి పేద కుటుంబానికి పోడు భూమి 10 ఎకరాలు ఇవ్వాలని, ఆదివాసీలపై పెద్దఎత్తున పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపు లో భాగంగా గురువారం అశ్వారావుపేటలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో వెంకట దుర్గ థియేటర్ నుండి పోడు సాగు దారుల పోరు యాత్ర ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర  సహాయ కార్యదర్శి పోటు రంగారావు పోరు యాత్రను ప్రారంభించి  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఆదివాసీల ఎడల ద్వంద విధానాలను అనుసరిస్తోందని, గత ఏడు సంవత్సరాలుగా పోడు సాగు దారులకు అనేకసార్లు వాగ్దానాలు చేసి విస్మరించిందని, ప్రతిసారి ఎన్నికల సమయంలో పోడు భూముల సమస్య పరిష్కరిస్తానని  హామీ ఇస్తూ ఎన్నికల తర్వాత ఆదివాసీలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని 2006లో అటవీ హక్కుల చట్టం ప్రకారం ఆదివాసీ పేదలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, ఆదివాసీలకు మరియు ప్రతి పేద కుటుంబానికి పది ఎకరాలు భూమి ఇవ్వాలని  వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని  డిమాండ్ చేశారు. పోడు భూముల్లో కుర్చీ వేసుకుని కూర్చుని పోడు భూముల సమస్యను పరిష్కరిస్తాం అన్న కెసిఆర్ కు కుర్చీ దొరకలేదా  అని ఎద్దేవా చేస్తూ, పోడు భూములు సమస్యలు పరిష్కరించకుంటే ఇప్పుడు కూర్చున్న కుర్చీని ప్రజలు లాగేస్తారని వారు హెచ్చరించారు. సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ముద్దా బిక్షం, అమర్లపూడి రాము, నూపా భాస్కర్, గోకినేపల్లి ప్రభాకర్, కెచ్చల కల్పన, తెలుగుదేశం రాష్ట్ర నాయకులు కట్రం స్వామి దొర  తదితరులు ప్రసంగించారు. అనంతరం వందలాది మంది ప్రజలు పోరు యాత్ర ద్వారా దమ్మపేట మండలం కు పయనమయ్యారు. ఈ కార్యక్రమంలో నాయకులు తోడం దుర్గమ్మ, కల్లూరి కిషోర్, వాసం బుచ్చిరాజు, కుంజా అర్జున్, పండ ముత్యాలు, ధర్ముల శ్రీరాములు , కుంజా కృష్ణ, కంగాల గోవిందు, గొంది లక్ష్మణరావు, నూప సరోజిని, బాడిశ లక్ష్మణరావు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: