CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జూలూరుపాడు లో ఘనంగా పీరీల పండుగ వేడుకలు...

Share it:

 మన్యం టీవీ : జూలూరుపాడు, ఆగస్టు 20, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలంలోనీ జూలూరుపాడు, పాపకొల్లు, పుట్టకోట, గుళ్ళరేవు, కాకర్ల, నర్సాపురం, గ్రామాలలో గత పది రోజులుగా మొహరం నెల వేడుకలు జరుగుతున్నాయి.ఈ సందర్భంగా పదవ రోజు పీరీలను ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఈ ఊరేగింపులో కులాలకు మతాలకు అతీతంగా హిందువులు సైతం పీర్లలకు నీళ్లు పోసి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఊరేగింపు కార్యక్రమం లో హిందూ ముస్లిం యువకులు పాల్గొన్నారు. గ్రామ మొహర్రం కమిటి పెద్దలు మరియు ప్రజలు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మొహరం నెలలో హస్సేన్, హుస్సేన్, కర్బలా యుద్ధ మైదానంలో అమరులైన త్యాగమూర్తుల జ్ఞాపకానికి చిహ్నంగా పది రోజులు ఉపవాసాలు ఉంటారని, యుద్ధ వీరులకు స్వర్గ ప్రాప్తి కలగాలని దువా చదువుతారని, గ్రామ పెద్దలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సమీర్,సోందు,మక్బుల్ పాషా, బాబు,బబ్లూ,నాగుల్ మీరా,తన్విర్,సల్మాన్ ఖాన్,జానిబాబు,గౌస్,పాషా (వెల్డింగ్),మన్సుర్అలీ,ఖాజులుతదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: