CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ములుగు జిల్లా గిరిజన యూనివర్సిటీ తరగతులు నిర్వహించాలని జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష ర్యాలీ

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం

 ములుగు జిల్లా కేంద్రంలో ఆదివారం యువజన కాంగ్రెస్ అద్యక్షులు బానొత్ రవిచందర్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరైన ఏఐసీసీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి మరియు దళిత గిరిజన దండోరా ములుగు జిల్లా ఇంచార్జి రవళి,హాజరై ఈ సందర్భంగా ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ 2014లో  తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది ఆంధ్రకు ఒక్కటి తెలంగాణకు ఒక్కటి గిరిజన యూనివర్సిటీ మంజూరు చేసింది. అప్పటినుండి ఆంధ్రలో 2015&2016 లో గిరిజన యూనివర్సిటీ తరగతులు ప్రారంభించి ఇప్పుడు తరగతులు నడుస్తుంటే ఇక్కడ తెలంగాణలో ఇప్పటివరకు అతీగతీ లేదుఅని అన్నారు. రైతుల భూములు   తీసుకున్నారు.ప్రభుత్వ భూమి మంజూరు జరిగిన ఇంతవరకు పనులు ప్రారంభించకుండా తరగతులు నిర్వహించకుండా ఉండటం సిగ్గుచేటు అలాగే కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేపించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయింది. అలాగే తెలంగాణ రాష్ట్ర అభివద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించకుండా ఉంటుంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలసత్వం మాని వెంటనే ములుగు జిల్లా లో గిరిజన యూనివర్సిటీ తరగతులు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై దశలవారీగా ఉద్యమం చేస్తామని తెలిజేస్తున్నాము అని అన్నారు.ఈ కార్యక్రమంలో  ములుగు  జిల్లా కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షులు నల్లెల్ల కుమార్ స్వామి,ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్  అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, ములుగు జిల్లా యూత్  కాంగ్రెస్ అధ్యక్షులు భానోత్ రవిచందర్, ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్ టి సెల్  అధ్యక్షులు గుమ్మడి  సోమయ్య సీనియర్ నాయకులు మరియు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మెన్ మల్లాడి రామి రెడ్డి,ములుగు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ చాంద్ పాషా,ములుగు పిఎసిఎస్ చైర్మన్ బొక్క సత్తి రెడ్డి,  ములుగు పిఎసిఎస్ వైస్  చైర్మన్ మర్రి రాజు,ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ  సీనియర్ నాయకులు, ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు మరియు అనుబంధ సంఘాల జిల్లా సీనియర్ నాయకులు,మండల అధ్యక్షులు మరియు మండల అనుబంధ సంఘాల అధ్యక్షులు, గ్రామ కమిటీ అధ్యక్షులు మరియు గ్రామ కమిటీ అనుబంధ సంఘాల అధ్యక్షులు,ఎంపీటీసీలు,జడ్పిటిసిలు,సర్పంచులు,వార్డ్ మెంబర్లు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: