CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నాగరికతకు నాయకులు ఆదివాసులు

Share it:

 



సమాజానికి సంస్కృతిని నేర్పింది ఆదివాసులు


ఆదివాసి గా పుట్టినందుకు గర్వపడదాం


ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చిన పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ


మన్యం మనుగడ, పినపాక: 


ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకొని పినపాక మండలంలో ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమము పినపాక మండల ఆదివాసి ఐక్య వేదిక అధ్యక్షుడు తోలెం శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగింది పినపాక మండలం లోని జానంపేట గ్రామంలో  ఆదివాసి బిడ్డ, గోండు వీరుడు కొమరం భీం విగ్రహానికి పూలమాలలు  వేసి, పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ జెండా ఎగరవేయడం జరిగింది. అనంతరం 

ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్ లో గల కొమరం భీం విగ్రహం వద్ద భారీ ఆదివాసి జన సమూహంతో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆదివాసీ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ప్రజా ప్రతినిధులు కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్ లో కొమరం భీం విగ్రహం వద్ద జెండా ఆవిష్కరించిన పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ మాట్లాడుతూ, ఆదివాసీ గా పుట్టడం అదృష్టమని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసి హక్కులను కాపాడుకునే విధంగా చట్టాలను తీసుకు రావాలని తన అభిప్రాయాన్ని తెలియజేశారు. 1/70, జీవో నెంబర్ 3 ఇష్టంగా అమలయ్యే దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచానికి దిశానిర్దేశం అని అన్నారు. సమాజానికి నాగరికతను నేర్పిన మొదటి గురువులుగా ఆదివాసులను ఐక్యరాజ్యసమితి పరిగణించి, ఆగస్టు 9 ని ప్రపంచ ఆదివాసి దినోత్సవం గా గుర్తించిందని తెలియజేశారు.ఆదివాసులు ఐక్యత్వం కోల్పోకుండా ఒకే తాటిపై నిలబడి, సంస్కృతిని కాపాడుకునే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలియజేశారు.నాగరికతకు మూలవాసులైన ఆదివాసులు సమాజానికి నాగరికత నేర్పిన గురువులు అని కొనియాడారు. అనంతరం ఆదివాసి ఐక్యవేదిక గౌరవ అధ్యక్షులు ఇర్పా రామనాథం మాట్లాడుతూ, కొమరం భీం ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఆదివాసి బిడ్డ పనిచేయాలని, ఆదివాసి సంస్కృతిని కాపాడుకొనే విధంగా కృషి చేయాలని, పిలుపునిచ్చారు. ప్రజా గాయకులు అయిన సిద్దెల హుస్సేన్ ఆదివాసీలు ప్రేరణ పొందే విధంగా తనదైన గానామృతంతో ఆదివాసీ గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సాంస్కృతిక సంక్షేమ సంఘం   డివిజన్ అధ్యక్షులు పోలెబోయిన అనిల్ కుమార్, ఆదివాసి సామాజిక కార్యక్రమాల రూప కర్త, ఆదివాసి ఐక్య వేదిక కన్వీనర్ సోలం అశోక్, ఎంపీటీసీలు కాయం శేఖర్, రిటైర్డ్ ఆదివాసి తహసిల్దార్ కలివేటి బ్రహ్మయ్య, వివిధ పంచాయతీలకు చెందిన సర్పంచులు, కోరం రజిని ,  గొగ్గల నాగేశ్వరరావు, మహేష్, సునీల్, కృష్ణంరాజు, శివ శంకర్, సుధాకర్ ,  ఆదివాసి ఐక్యవేదిక నాయకులు గొగ్గల కృష్ణ , ఉండం బాబురావు వజ్జ రమేష్, దుబ్బ ముఖేష్, గోవిందు నాగేష్, పోల బోయిన సాంబశివరావు, కొర్శ రామయ్య, గుమ్మడి అశోక్, సుతారి నరేష్, తునికి రామారావు, కుంజ కృష్ణ వివిధ శాఖల ఆదివాసి ఉద్యోగులు అయిన కొమరం  కేశవరావు, కొమరం నాగేంద్రబాబు, యాలం రంగారావు, చవలం అరుణ, శీలం వీరస్వామి, కొమరం అరుణ్ బాబు, సాంబ, కొమరం గణపతిరావు, వజ్జా రామ్మూర్తి, కొమరం జయవంత్ రావు, బయ్యారం వ్యవసాయ విస్తరణ అధికారి కొమరం లక్ష్మణరావు, రేషన్ డీలర్లు పోలె బోయిన శ్రీను, పాయం హనుమంతు, ఎట్టి సూర్యప్రకాష్ ,మీడియా ప్రతినిధులు,తదితర ఆదివాసి గ్రామాల ప్రజానీకం పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: