CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి... అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు.

Share it:



 మన్యం టీవీ,దమ్మపేట:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అశ్వారావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండలం, తాటిసుబ్బన్నగుడెం గ్రామం ఎమ్మెల్యే స్వగృహం లో అశ్వారావుపేట నియోజకవర్గ అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు,నాయకులతో ప్రత్యేక సమావేశమైన అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కెసిఆర్ ఆదేశాల మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విజ్ఞప్తి మేరకు సెప్టెంబర్ 2న అశ్వారావుపేట నియోజకవర్గం లోని అన్ని మండలాలోని పంచాయతీలలో టీఆర్ఎస్ జెండా పండుగను ఘనంగా నిర్వహించలని,పార్టీలో జెండా పండుగ నుంచి కమిటీల సందడి ప్రారంభం కానున్నదని,సెప్టెంబర్ 2న అశ్వారావుపేట నియోజకవర్గంలోని అన్ని గ్రామ పంచాయితీలలో జెండా పండుగ తో పాటు అదే రోజు నుంచి గ్రామ కమిటీ ల నిర్మాణం మొదలవుతుందని,సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు గ్రామ, వార్డు కమిటీ లు వెయ్యాలినీ,సెప్టెంబర్ 12 నుంచి 20 వరకు మండల కమిటీ లు పూర్తి చేయాలనీ,సెప్టెంబర్ 20 తర్వాత జిల్లా కమిటీ ల నిర్మాణంలో అందరి భాగస్వామ్యం వుండాలినీ,అన్ని కమిటీలలో మహిళలతో పాటు SC,ST, BC, మైనార్టీ వర్గాలకు చెందినవారు నిర్దేశించిన విధంగా ఆయా కమిటీలలో స్థానం కల్పించాలనీ. కమిటీలను ఏర్పాటు చేసే సమయంలో ఈ జాగ్రత్తలను విధిగా పాటించాలని,పార్టీ కమిటీలతో పాటు, పార్టీకి అనుబంధంగా విద్యార్థి, యువజన,కార్మిక,మహిళా, రైతు విభాగాల కమిటీలను కూడా ఏర్పాటు చేయనున్నామన్నారు.వీటితోపాటు సోషల్ మీడియా మండల,పట్టణ కమిటీలు ఏర్పాటు చేయాలి అన్నారు.

ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట నియోజకవర్గ మండల అధ్యక్షులు,నాయకులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: