CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చండ్రుగొండ బస్టాండ్ ను పట్టించుకోని ఆర్టీసీ అధికారులు మంత్రి పువ్వాడ రాకతో బస్టాండ్ రూపురేఖలు మారేనా

Share it:

 


పారిశుధ్యం లోపించడంతో బస్టాండ్ ఆవరణలో కానరాని ప్రయాణికులు


 చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి  :

శిధిలావస్థలో ఉన్న చండ్రుగొండ బస్టాండ్ ను అభివృద్ధి చేసేందుకు, బస్టాండ్ ఆవరణలో బస్సుల రాకపోకలను కొనసాగించేందుకు గతంలో ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకుగాను బస్టాండ్ ఆవరణలో చెత్త, చెదారం తొలగించి బస్టాండ్ ఎదురుగా ఇన్ గేట్, అవుట్ గేట్ లను ఏర్పాటు చేసి కంట్రోలర్ ను విధులు నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. దీంతో ఇటుగా వెళ్లే బస్సులన్నీ బస్స్టాండ్ ఆవరణ లోకి వెళుతూ ప్రయాణీకులకు సౌకర్యవంతంగా ఉండేది, కానీ ఈ మధ్య గత కొన్నాళ్లుగా ఆవరణలో కంట్రోలర్ విధులు నిర్వహించకపోవడంతో అటుగా వెళ్లే బస్సులు బస్టాండ్ లోకి వెళ్ళకుండా జాతీయ రహదారిపై నుంచే వెళుతున్నాయి. ఈ కారణంగా ప్రయాణికులు బస్ స్టాండ్ ఆవరణలోకి రాకపోవడం రాత్రులు కనీసం లైట్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోందని కొందరు ఆరోపిస్తున్నారు. రాత్రి అయితే మందుబాబులకు అడ్డాగా మారుతోందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల కాలంలో బస్ స్టాండ్ ఆవరణ అంతా మందు బాటిల్స్, సిగరెట్, బీడీ వ్యర్థాలతో చెత్త, చెదారలతో అస్తవ్యస్తంగా కనిపిస్తుంది. కనీసం ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటుచేసిన మరుగుదొడ్లు కూడా వాడుకలో లేవని, ఇటు పంచాయతీ అధికారులు గాని, ఆర్టీసీ అధికారులు గాని బస్టాండ్ పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టడం లేదని స్థానికులు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. బస్సులు మధ్యాహ్నం భోజన సమయంలో తప్ప మిగతా సమయాలలో బస్టాండ్ ఆవరణలోకి రావట్లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఈ కారణంతో ప్రయాణికులు చండ్రుగొండ ప్రధాన సెంటర్ లోని జాతీయ రహదారిపై కూర్చోవడానికి నిలువ నీడ లేక పోవడంతో ఎండ, వానకు బస్సుల కోసం వేచి చూసేందుకు అవస్థలు పడుతున్నారు. ప్రయాణికుల సౌకర్యాన్ని గుర్తించి సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బస్టాండ్ ను పునరుద్ధరించాలని కోరుతున్నారు. బస్సులు బస్టాండ్ ఆవరణలోకి వచ్చి వెళ్లే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కంట్రోలర్ ను ఏర్పాటు చేసి విధులు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని బస్టాండ్ ను పునరుద్ధరించి, అభివృద్ధి చేయుటకు అధికారులు ప్రతిష్ఠాత్మక చర్యలు చేపట్టి ప్రయాణీకుల వసతికి సిమెంట్ బల్లలను ఏర్పాటు చేసి బస్టాండ్ కు పూర్వవైభవం తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Share it:

Post A Comment: