CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మణుగూరు అంబేద్కర్ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహాన్ని తొలగింపును అడ్డుకున్న అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కమిటీ, అఖిలపక్ష పార్టీల నాయకులు

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, అంబేద్కర్ సెంటర్ లో గతంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని నూతన అంబేద్కర్ సర్కిల్ అభివృద్ధి లో భాగంగా మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు తొలగిస్తుండగా స్థానిక రాజకీయ పార్టీల నాయకులు,గతంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన కమిటీ వారు అడ్డుకొని,నిరసన తెలియజేశారు.ఈ సందర్భంగా రాజకీయ పార్టీల నాయకులు బొల్లోజు అయోధ్య,వట్టం.నారాయణ,మధుసూదన్ రెడ్డి, పాలమూరి.రాజు,భిక్షపతి, రావులపల్లి రామమూర్తి, పప్పుల మణిబాబు, తదితరులు మాట్లాడుతూ. మణుగూరు లో గత 30 ఏళ్ల క్రితం భారత రాజ్యాంగ నిర్మాత,భారత రత్న,డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని దాతల సహాయం ద్వారా ఏర్పాటు చేయడం జరిగిందని,ఇప్పుడు రోడ్డు వెడల్పు పేరుతో తొలగించడం దారుణమని, తొలగిస్తే అందరికీ ఆమోదయోగ్యమైన స్థలంలో నిర్మాణం చేపట్టాలని ఆందోళన చేయడం జరిగింది.ఈ విషయం పై స్పందించిన మణుగూరు సిఐ భాను ప్రకాశ్ అఖిలపక్ష నేతలను, మున్సిపల్ కమిషనర్ తో అంబేద్కర్ అందరికి కావలసిన వ్యక్తి అని, ఆయనను గౌరవించడం అందరి బాధ్యత అని, అందరూ కోరినచోట విగ్రహం ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ కు తెలిపారు.స్పందించిన మున్సిపల్ కమిషనర్ కూడా అంగీకారం తెలపడంతో అంబేద్కర్ విగ్రహాన్ని, మణుగూరు ప్రారంభంలో హనుమాన్ టెంపుల్ సెంటర్ లో ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది.అందుకు కమిషనర్ స్పందించి ఏర్పాట్లకు అంగీకరించారు. ఈ సందర్భంగా విగ్రహ నిర్మాణం కోసం అఖిలపక్షం తరుపున వినతిపత్రం కమిసనర్ కు ఆందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి చలపతిరావు, పీరినాకి నవీన్ దుర్గ్యల సుధాకర్,ఎస్.కే.సర్వర్, లింగంపల్లి రమేష్, వేల్పుల నరేష్,సుధీర్,నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: