CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పడమట నర్సాపురం లో మొబైల్ వ్యాక్సినేషన్ సెంటర్..

Share it:

 



👉 భారీగా వ్యాక్సినేషన్ లో పాల్గొన్న ప్రజలు..


👉 మొబైల్ వ్యాక్సినేషన్ సెంటర్ సేవలను అందరూ ఉపయోగించుకోవాలి వైద్యాధికారి డాక్టర్ వీరబాబు..



మన్యం టీవీ : జూలూరుపాడు,

ఆగస్టు 16, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం గ్రామ పంచాయతీలోని శ్రీ వెలగా కోటయ్య మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మండల వైద్యాధికారి డాక్టర్ వీరబాబు ఆధ్వర్యంలో సోమవారం మొబైల్ వ్యాక్సినేషన్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ వీరబాబు మాట్లాడుతూ.. కోవిడ్ వ్యాక్సిన్ పై అపోహలను ఎవరు నమ్మవద్దని కోరారు.18 సంవత్సరాలు పైబడిన వారందరూ కోవిడ్ వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. రానున్న రోజుల్లో ఈ టీకా సంజీవిని లా మన ప్రాణాలను కాపాడుతుందని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కోవిడ్ నిబంధనలు అందరూ పాటించాలని తెలిపారు. మండల ప్రజలందరూ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్దకు వచ్చి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొనుటకు, రిజిస్ట్రేషన్ ప్రక్రియకు, అనేక రకాల ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మన మండలంలో ప్రతి గ్రామపంచాయతీలో మొబైల్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలోనే మన మండలంలో విస్తృతంగా మొబైల్ వాక్సినేషన్ సెంటర్ ద్వారా కోవిడ్ టీకాను అందిస్తున్నట్లు తెలిపారు. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని నూటికి నూరు శాతం కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొన్న మండలంగా పేరొందేలా ప్రజలు అందరూ సహకరించాలని కోరారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటు, వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ, మన పరిసరాలలో మురుగు నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని సూచించారు. మొబైల్ వ్యాక్సినేషన్ సెంటర్ ద్వారా పడమట నర్సాపురం గ్రామంలో 300 మందికి పైగా కోవిడ్ వ్యాక్సిన్ టీకాను అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సర్పంచ్ కట్రం మోహన్ రావు, ఎంపీటీసీ కాజా విజయరాణి, కార్యదర్శి తిరుపతి, పంచాయితీ కార్యవర్గ సభ్యులు కాజా రమేష్, మొబైల్ వ్యాక్సినేషన్ డాక్టర్ తబాసుం, సి హెచ్ వో లు శ్రీధర్, వెంకటేశ్వర్లు, ఏఎన్ఎం లు ఆదిలక్ష్మి, జీజా, తార, సుజాత, ఝాన్సీ, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశాలు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: