*మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ఏటూరు నాగారం ఐటీడీఏ కార్యాలయం లో అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారి (జనరల్) వసంతరావు మహాత్మాగాంధీ,అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి జెండా ఆవిష్కరించారు. అనంతరం స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకు,ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు 75 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ మంకిడి ఎర్రయ్య,ఎస్ డి సి శ్రీరాములు,పిఏవో లక్ష్మీ ప్రసన్న,ట్రైబల్ వెల్ఫేర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హేమలత,ఏవో టీవీఆర్ దామోదర స్వామి,ఏఏవో సంతోష్,మేనేజర్ భూక్యా లాల్ నాయక్,అకౌంట్స్ మేనేజర్ కరీం,ఏసిఎంఓ సారయ్య దొర, పెసా కోఆర్డినేటర్ కొమరం ప్రభాకర్,వాగ్యనాయక్, కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: