CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రపంచ ఆదివాసి దినోత్సవం సన్నాహక సమావేశం...

Share it:

 



మన్యం టీవీ : జూలూరుపాడు, ఆగస్ట్ 1, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల కేంద్రం లోని సాయి ఎక్స్లెంట్ స్కూల్ నందు ఈ నెల 9 వ తారీకు జరుపుకో బోయే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సన్నాహక సమావేశం ఆదివారం నిర్వహించారు.ఈ సమావేశంలో ఏన్కూరు,జూలూరుపాడ్,కారేపల్లి మండలలా ఆదివాసీ ఉద్యోగులు, ఆదివాసీ సర్పంచులు, మరియు ఆదివాసీ రాజకీయ నాయకులు గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, పాల్గొన్నారు. ఆగస్టు-09న నిర్వహించే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం కార్యక్రమాన్ని అన్ని ఆదివాసి గ్రామాలలో జండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించాలని, అదేవిధంగా మండల కేంద్రాలలో జండా ఆవిష్కరణ చేయాలని, నియోజకవర్గ స్థాయిలో ఏన్కూర్ మండల కేంద్రంలో భారీ ప్రదర్శన నిర్వహించి, ఆదివాసీ సంప్రదాయం తో కొమ్ము నృత్యాలతో ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని జరుపుకోవాలని సమావేశంలో తీర్మానించారు. అదే రోజు జూలూరుపాడ్ నుంచి ఏన్కూరు,కారేపల్లి, వరకు సుమారు 200 బైక్ లతో  ర్యాలీ నిర్వహించాలని తీర్మానించారు.  ఈ కార్యక్రమంలో ఆదివాసి ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, కుల పెద్దలు వివిధ పార్టీల లో పనిచేస్తున్న ఆదివాసి రాజకీయ నాయకులు, యువకులు, విద్యార్థులు, మహిళలు, పాల్గొన్నారు.

Share it:

Post A Comment: