CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎప్పటికీ రుణపడి ఉంటాం

Share it:

 



ప్రభుత్వ విప్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్న భూనిర్వాసితులు

బి టి పి ఎస్ నిర్మాణం, పినపాక నియోజకవర్గ నిరుద్యోగులకు వరం-ఎమ్మెల్యే రేగా


మన్యం మనుగడ, పినపాక: 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు- పినపాక మండలాల సరిహద్దులో నిర్మించిన భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కు చెందిన భూ నిర్వాసితులకు తెలంగాణ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆధ్వర్యంలో నియామక పత్రాలను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమము భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కు చెందిన సీఈ బాలరాజు ఆధ్వర్యంలో జరగగా, తెలంగాణ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు, జెన్కో డైరెక్టర్లు అజయ్ కుమార్, అశోక్ కుమార్ లు ముఖ్య అతిథులుగా పాల్గొని, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించారు. ఈ సందర్భంగా సి ఈ బాలరాజు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ఎమ్మెల్యే రేగా కాంతారావు చొరవతో భూనిర్వాసితుల అందరికీ ఉద్యోగ నియామక పత్రాలను అందజేయడం చాలా సంతోషంగా ఉందని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. కొన్ని అనివార్య కారణాలవల్ల నియామక పత్రాలను ఇవ్వలేక పోయిన వారికి నెల రోజులు తిరిగేలోపు నియామక పత్రాలను అందజేసే విధంగా ప్రయత్నిస్తామని తెలియజేశారు. అనంతరం జెన్ కో డైరెక్టర్ హెచ్ ఆర్ ఎస్ అజయ్ మాట్లాడుతూ 2015 మార్చి 28న ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేసిన ఈ భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ త్వరలోనే పూర్తిగా వస్తుందని, కరోనా కష్టకాలంలో కూడా ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడకు పని నిమిత్తం వచ్చిన శ్రామికులు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం జెన్కో డైరెక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ, మారుమూల గ్రామంలో నెలకొల్పిన భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణానికి మొదటినుండి తన పూర్తి సహాయ సహకారాలను సలహాలను అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు, పినపాక ఎమ్మెల్యే కాంతారావు కు తన కృతజ్ఞతలు తెలియజేశారు. ఉద్యమ క ఉద్యోగ నియామక పత్రాలు పొందిన భూ నిర్వాసితులు అందరూ క్రమశిక్షణతో కూడిన విధి నిర్వహణ చేయవలసిన అవసరం ఉంది అని తెలియజేశారు. భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ఉద్యోగి, స్వతహాగా గాయకుడైన సిద్దెల హుస్సేన్, ఎమ్మెల్యే రేగా కాంతారావు చేసిన కృషి పట్ల, నియోజకవర్గ ప్రజల పై ఉన్న మమకారం గురించి "పొడిచేటి పొద్దువయా గులాబీ జెండ వయా" అంటూ అద్భుతమైన గానాన్ని ఆలపించారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ, భూ నిర్వాసితులు అందరికీ ఉద్యోగాలు లభించడం అందరి కంటే నాకే చాలా సంతోషంగా ఉందని, గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, ఉద్యోగాల కోసం అరెస్ట్ అయ్యానని, అదే ఉద్యోగాల సాధన కోసం టిఆర్ఎస్ పార్టీలో చేరి, ఉద్యోగాలు సాధించడం పట్ల చాలా సంతోషంగా ఉందని అన్నారు. సాంకేతిక కారణాల వల్ల ఉద్యోగాలు లభించని వారికి తాను స్వయంగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి, తోడ్ప పడతానని, తెలియ చేశారు.

ఈ కార్యక్రమంలో మణుగూరు జడ్పిటిసి పోషం నరసింహారావు, ఎంపీపీ కారం విజయ కుమారి, పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ, పినపాక మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు తుళ్లూరు బ్రహ్మయ్య,పీఏసీఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు,వైస్ ఎంపీపీ కె.వి.రావు, ఎంపీటీసీల సంఘం జిల్లా కార్యదర్శి గుడిపూడి కోటేశ్వరరావు, ఎంపీటీసీ లు, కో అప్షన్ సభ్యులు జావిద్ పాషా,సర్పంచ్ లు,కాయం. తిరుపతమ్మ,ఏనిక ప్రసాద్, కురసం.రాంబాబు,కొమరం.జంపేశ్వరి,బొగ్గం.రజిత,కారం.ముత్తయ్య,ఉప సర్పంచ్ లు,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు, పట్టణ అధ్యక్షులు అడపా, అప్పారావు,వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి నవీన్,మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,యువజన అధ్యక్షులు సాగర్ యాదవ్,హర్షవర్ధన్, రుద్ర వెంకట్,టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు,మహిళ కార్యకర్తలు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: