CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జగ్గారంలో ముమ్మరంగా శానిటేషన్ పనులు

Share it:

 



ప్రజలు డెంగ్యూ వ్యాధి బారిన పడకుండా తగు జాగ్రత్తలు


మండల అభివృద్ధి అధికారి శ్రీనివాసులు ఆదేశాలతో

శానిటేషన్ కొరకు బృందాల ఏర్పాటు


మన్యం మనుగడ, పినపాక: 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లో డెంగ్యూ జ్వరాలు కారణంగా ఇప్పటివరకు ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఈ విషయాన్ని మన్యం మనుగడ "జగ్గారం పంచాయతీని పట్టిపీడిస్తున్న జ్వరాలు"పేరుతో కథనం రాయడం జరిగింది.వెంటనే స్పందించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు పినపాక మండల అభివృద్ధి అధికారికి డెంగ్యూ వ్యాధులు రాకుండా, తగిన జాగ్రత్తలు తీసుకొని గ్రామం మొత్తాన్ని పూర్తిగా శానిటేషన్ చేయించాలని ఆదేశించడం జరిగింది. వెంటనే స్పందించిన మండల అభివృద్ధి అధికారి శ్రీనివాసులు జగ్గారం సర్పంచ్ అనంత, సెక్రటరీ అరుణ్ కుమార్ లతో శానిటేషన్ కు సంబంధించి కొన్ని బృందాలను ఏర్పాటు చేసి, ప్రజలకు అవగాహన కల్పించాలని తెలియజేశారు. మంగళవారం రోజున జగ్గారం గ్రామంలో, సెక్రటరీ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో శానిటేషన్ పనులు చేశారు. గ్రామంలోని ప్రతి గృహంలో దోమలకు సంబంధించిన లార్వా అభివృద్ధి చెందకుండా మందులు పిచికారి చేయించారు. గ్రామంలోని ప్రతి వీధిని బ్లీచింగ్ చేయడం జరిగింది. గృహ పరిసరాలలో వ్యర్ధంగా నీటితో ఉన్న పాత్రలను, ఇతర సామాగ్రిని ఖాళీ చేయించి, వాటి వలన జరిగే అనర్థాలను గురించి వివరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: