CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రతి గ్రామంలో పార్టీ జెండా ఘనంగా నిర్వహించాలి:అధ్యక్షులు రావుల సోమయ్య

Share it:

 


టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు,ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు వచ్చే నెల 02న గ్రామ,గ్రామన టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగను ఘనంగా నిర్వహించాలని మండల పార్టీ అధ్యక్షులు రావుల సోమయ్య తెలిపారు.

కరకగూడెం మండల టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు.

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 12వ తేదీ వరకు గ్రామ,బ్లాక్ కమిటీలు పూర్తి చేయాలని సర్పంచులకు,ప్రజాప్రతినిధులకు తెలిపారు.

వచ్చే 2వ తేదీన ఉదయం అన్ని గ్రామాల్లో గ్రామ కమిటీ అధ్యక్షులు చేత పార్టీ జెండా ఎగిరేయ్యాలని అన్నారు.పార్టీ కార్యకర్తలు,

సర్పంచులు,ప్రజాప్రతినిధులు సహకరించాలని తెలిపారు.12వ తేదీ తరువాత మండల,పట్టణ అధ్యక్షుల ఎంపిక,అనుబంధ సంఘాల ఎంపిక చేయడం జరుగుతుందని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో మండల ఎంపిపి రేగా కాళిక,మండల ప్రధాన కార్యదర్శి బుడగం రాము,గ్రామ కమిటీ అధ్యక్షులు చిట్టి సతీష్,టిఆర్ఎస్వి పినపాక నియోజకవర్గ అధ్యక్షులు గుడ్ల రంజిత్ కుమార్,పార్టీ నాయకులు అక్కిరెడ్డి వెంకట్ రెడ్డి,కొంపెళ్ళి పెద్ద రామలింగం,రేగా సత్యనారాయణ,కరకగూడెం ఉప సర్పంచ్ రావుల రవి,జట్ల సత్యం,రావుల శ్రీను,చిట్టిమల్ల ప్రవీణ్ కుమార్,బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: