CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అడవిపై ఆదివాసుల హక్కులు అమలు చేయాలి!

Share it:

 


👉ఆదివాసీ సంస్కృతి మరియు భాషలను కాపాడి వాటిని అభివృద్ధి చేయాలి! 

👉అటవీ ఉత్పత్తులు, అన్ని పంటలకు కనీస మద్దతు ధరల చట్టం చేయాలి! 

👉 జడ్పిటిసి మేరెడ్డి వసంతక్క డిమాండ్

మన్యం టీవీ, కొత్తగూడెం, ఆగస్టు :- 9 మన నాగరికతలో ఆదివాసులు ఒక ముఖ్యమైన భాగం. వారు జనాభాలో 8% ఉన్నారు. వందలాది తెగలకు విలక్షణమైన సంస్కృతి, భాషలు వున్నాయి. వారిలో చాలామంది షెడ్యూల్డ్ తెగలుగా వర్గీకరించబడినప్పటికీ, కొన్ని తెగలకు చెందిన వారు దశాబ్దాలుగా దీన్నుండి మినహాయించబడ్డారు. అయినప్పటికీ, వారు అత్యంత దోపిడీకి గురైన, అన్నీ కోల్పోయిన, అణచివేయబడిన పరిస్థితులలో జీవిస్తున్నారు. వారి ఉనికికే ప్రమాదం ఏర్పడింది. అభివృద్ధి పేరిట వారి వనరులు కార్పొరేట్ దోపిడీకి కట్టబెట్టడంతో వారు తమ భూముల నుండి, అడవి నుండి తొలగించబడ్డారు. వరుసగా దేశాన్ని ఏలిన ప్రభుత్వాలు అనుసరించిన పేదల వ్యతిరేక విధానాల కారణంగా ఆదివాసీ తెగలు, వారి భాషలు, సంస్కృతి అభివృద్ధి చెందలేదు. అనేక తెగలు నేడు అంతరించే స్థితిని ఎదుర్కొంటున్నాయి. 1994లో ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం ఆగస్టు 9న మూలవాసీ దినంగా ప్రకటించిదే ప్రకటించింది తప్ప  ఎటువంటి ప్రయోజనం లేదు ఇప్పటికైనా ఆదివాసీలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వాలు పూనుకోవాలిఅని లక్మిదేవి పల్లి, జెడ్ పి టి సి మేరెడ్డి వసంతక్క తెలియజేశారు.

Share it:

Post A Comment: