CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అక్రమ రేషన్ బియ్యం నిల్వలను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీస్..

Share it:

 


👉 మండలంలో మరికొన్ని అక్రమ నిల్వలు ఉన్నట్లు గుసగుసలు..

👉 అక్రమ సంపాదన కోసం వ్యాపారుల అడ్డదారి..


మన్యం టీవీ : జూలూరుపాడు, ఆగస్టు 12, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం బేతాలపాడు గ్రామం లో విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు సుమారుగా 200 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. వివరాలలోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం, జిల్లా ఎస్పీ కి అందిన విశ్వసనీయ సమాచారం తో ఎస్పీ ఆదేశం మేరకు టాస్క్ ఫోర్స్ సిఐ పి.పుల్లయ్య నేతృత్వంలో గురువారం నాడు సుమారుగా ఆరు గంటల సమయంలో బేతాలపాడు గ్రామంలో చింతల నర్సయ్య అను వ్యక్తి ఇంట్లో సుమారుగా 200 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకొన్నారు. పట్టుబడిన రేషన్ బియ్యం బస్తాలు రేషన్ డీలర్ల దగ్గర నుండి నేరుగా అక్రమార్కుల చేతికి అందుతున్నాయని పట్టుబడిన రేషన్ బియ్యం బస్తాలకు ఉన్న రేషన్ మిల్లుల ముద్రలు సైతం కనువిందు చేస్తున్నాయి. అర్హులైన పేద ప్రజలకు పంపిణీ చేయాల్సిన బియ్యం అధిక మొత్తంలో పట్టుబడడంతో మండల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ అక్రమ రేషన్ బియ్యం నిలువల తెర వెనుక వ్యాపారుల అస్తం ఉన్నట్టు గ్రామస్థులలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిరుపేదలకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని కొంతమంది వ్యాపారులు అక్రమ సంపాదన కోసం పేదల నోట్లో మట్టి కొట్టి దొడ్డిదారిన వ్యాపారం కొనసాగిస్తున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇవే కాక మండలంలో మరికొన్ని అక్రమ నిల్వలు ఉన్నట్లుగా గుసగుసలు వినబడుతున్నాయి. సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు అక్రమ రేషన్ బియ్యం నిల్వలపై దృష్టిసారించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. పట్టుబడిన రేషన్ బియ్యన్ని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఈ కార్యక్రమంలో జూలూరుపాడు ఎస్ ఐ పి.శ్రీకాంత్, టాస్క్ ఫోర్స్ సిబ్బంది వెంకట్, నారాయణ,సాయి కిరణ్,కిషోర్,రాము స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

Post A Comment: