CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కార్మికుల పక్షాన ఉండేది ఏకైక యూనియన్ టీబీజీకేఎస్ టీఆర్ఎస్ మాత్రమే మైనింగ్ స్టాప్ సోదరుడు సూటబుల్ జాబ్ ఇప్పించడం జరిగింది. లెవెన్ మెన్ కమిటీ సభ్యులు కాపు కృష్ణ

Share it:

 


మన్యం టీవీ కొత్తగూడెం, ఆగస్టు 8:-

కార్మికుల పక్షాన ఉంటూ కార్మికుల శ్రేయస్సు కోరుకునే ఏకైక యూనియన్ టీబీజీకేఎస్ మాత్రమే 2012లో రికగ్నైజేషన్ యూనియన్ గా ఎన్నికైన నాటినుండి కార్మికులకు ప్రయోజనకరమైన హక్కులను తీసుకొస్తూ ఎప్పుడూ ఊహించని విధంగా టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితక్క సహకారంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ని టీబీజీకేఎస్ ప్రెసిడెంట్ వెంకట్రావు, జనరల్ సెక్రటరీ మిర్యాల రాజి రెడ్డి,టీబీజీకేఎస్ సీనియర్ నాయకులు మల్లయ్య, అడిగిన వెంటనే ఎన్నో ప్రయోజనాలు కల్పించడం జరిగింది. తెలంగాణ ఇంక్రిమెంట్ తెలంగాణ రాష్ట్ర సాధన లో సకల జనుల సమ్మెలో నష్టపోయిన జీతము ఇవ్వడం. మొదలు కొని కారుణ్య నియామకాలు గతంలో  2012 కు ముందు మెడికల్ అన్ఫిట్ ఐ 3,200 మంది కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు లేక నెలకు ఇరవై ఐదు చొప్పున ఇచ్చే ఉద్యోగాల నుండి టీబీజీకేఎస్ ఎన్నికల తర్వాత నెలకు 50,100 పెంచుకుంటూ కెసిఆర్ సి&ఎండి తో మాట్లాడి  ఒకే దఫా 3200 మందికి నెలకు 270 మంది చొప్పున ఒకే సంవత్సరంలో అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. అంతకుముందున్న ఏ ఐ టి యు సి యూనియన్ నెలకు 25 మందికి ఉద్యోగాలు ఇవ్వండని సింగరేణి యాజమాన్యం ఒప్పందం చేసుకున్నది. అలా 3200 ను నెలకు 25 చొప్పున ఉద్యోగాలు ఇస్తే 35 సంవత్సరాలు ఉన్న కార్మికుడి కొడుకు కు ఉద్యోగం రావాలంటే 12 సంవత్సరాలు పడుతుంది. అంటే ఆ పిల్లవానికి 47 సంవత్సరాలకు ఉద్యోగం వచ్చి ఉండేది. దాన్ని  టీబీజీకేఎస్ వచ్చిన తర్వాత కార్మికుల ప్రయోజనం కోసం కేసీఆర్ తోటి మాట్లాడి ఎవరు ఊహించని విధంగా అందరికీ ఒకే దఫా ఉద్యోగాలు ఇప్పించిన ఘనత టీబీజీకేఎస్ యూనియన్ ది కార్మికులకు అన్ఫిట్ అయి జనరల్ మజ్దూర్ గా వెజ్ ప్రొటెక్షన్ లేకుండా ఫస్ట్ క్యాటగిరి జీతం ఇస్తుంటే వేజ్ ప్రొటెక్షన్ ఇప్పించిన ఘనత టీబీజీకేఎస్ యూనియన్ ది అంతకు ముందు ఏ ఐ టి సి యూనియన్ ఉన్నప్పుడు అన్ఫిట్ అయినా ఆ యూనియన్ సంబంధించిన కొంత మంది  కోసం వన్ టైం మెజర్ కింద అగ్రిమెంట్ చేసుకొని వారి యూనియన్ వారికి మాత్రమే లబ్ధి చేకూరే విధంగా ఏ ఐ టి యు సి యూనియన్ ఇప్పించటం జరిగింది. అప్పుడు సర్ఫస్ లో చేస్తున్న వారిని అండర్ గ్రౌండ్ పంపించి వీరిని సర్ఫేస్ లో ఉంచిన ఘనత ఏ ఐ టి యు సి యూనియన్ ది. కార్మికులు అందరికీ ప్రయోజనం కోసం పని చేయాలని వారి యూనియన్ కార్యకర్తగా పని చేయడం జరిగింది. ఇప్పుడేదో ఉద్దరిస్తున్నాం  అన్నట్లు చేస్తున్నారు. దీనిని ని మైనింగ్ స్టాప్ సోదరులకు గమనించాలి తాత్కాలికంగా చెప్పే మాటలు విని పనిచేసేవారిని నిందించడం వలన పని చేసేవారికి బాధ కలుగుతుంది. ఎప్పటికైనా కార్మికులకు మంచి చేసేది టీబీజీకేఎస్ మాత్రమే అని లెవెన్ మెన్ కమిటీ సభ్యులు కాపు కృష్ణ అన్నారు.

Share it:

Post A Comment: