CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

టి.ఎన్. ఆర్ ట్రస్ట్ సేవలు అభినంద నీయం

Share it:

 


👉మంత్రులు కె.టి.ఆర్,పువ్వాడ అభినదించారు

మన్యం టివి;ములకలపల్లి మండలం: ములకలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మండల ప్రజల కోసం,టి.ఎన్. ఆర్ ట్రస్ట్ వారు అంబులెన్స్ ని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల ద్వారా ములకలపల్లి మండలానికి వితరణచేశారు,టి.ఎన్.ఆర్. చేస్తున్న సేవలు అభినందనీయం అని తెలంగాణ రాష్ట్ర మంత్రులు కల్వకుంట్ల తారకరామారావు, పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పుట్టినరోజు సందర్భంగా కేటీఆర్ పిలుపు మేరకు గిఫ్ట్ స్మైల్ ద్వారా ఎమర్జెన్సీ రెస్పాన్స్ వెహికల్స్(అంబులన్స్)ను ఇవ్వాలనే పిలుపు మేరకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకలపల్లి గ్రామం కు చెందిన తాండ్ర నారాయణ రావు మెమోరియల్ ట్రస్ట్ తరుపున తాండ్ర వెంకటేశ్వరవు(USA) సోమవారం హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ కి హైద్రాబాద్ ప్రగతి భవన్ లో సోమవారం అందజేశారు.ఆయా అంబులెన్స్ ను మంత్రి కేటీఆర్ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి ప్రారంభించారు. ఇట్టి అంబులెన్స్ ను ములకలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కేటాయించారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కన్వీనర్ నడిపల్లి,నవీన్ కుమార్ పిఏసీఎస్ ములకలపల్లి మరియు దమ్మపేట సొసైటీ చైర్మన్లు నడిపల్లి సునంద,జోగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: