CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మరో క్విట్ ఇండియా ఉద్యమం రావాల్సిందే : సిపిఎం

Share it:

 




మన్యం టీవీ : ఇల్లందు 


 భద్రాద్రి కొత్తగూడెం ఇల్లందు ఆనాడు తెల్ల దొరల నుండి స్వాతంత్రాన్ని పొందడానికి క్విట్ ఇండియా ఉద్యమం చేపట్టామని,నేడు మోడీ ప్రభుత్వం కార్మిక,కర్షకుల, రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ పేద ప్రజలను రోడ్డు పాలన చేస్తున్నారని వారి హక్కుల పరిరక్షణ కోసం మరో క్విట్ ఇండియా ఉద్యమం రావాల్సిందేనని సి ఐ టి యు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం నాయకులు పిలుపునిచ్చారు. శనివారం ఇల్లందు మండలం లోని 29 గ్రామ పంచాయతీల సర్పంచులకు వినతి పత్రాలు అందజేసిన ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఎనిమిది నెలల నుండి రైతులు ఢిల్లీ లోతమ హక్కులను మూడు చట్టాలు గా మార్చే విధానాన్ని మానుకోవాలని, దీక్షలు చేస్తున్నా రైతులను పట్టించుకోవడం లేదని మరోవైపు నలభై చట్టాలుగా ఉన్న కార్మిక హక్కులను నాలుగు కోడ్ లుగా చేయడం వలన పేద రైతులు కార్మికులు కర్షకులు వీధిన పడ్డారు అని అని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్లో తగినంత బలం ఉందని తన ఇష్టానుసారంగా నిరంకుశంగా మోడీ పరిపాలిస్తున్నాడు అని అన్నారు.కరోనా లో లక్షలాదిమంది చనిపోతుంటే ఇక్కడ వ్యాక్సిన్ ఇవ్వకుండా విదేశాలకు అమ్ముకొని వ్యాపారాలు చేస్తున్నారని బీజేపీని తప్పు పట్టారు. దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా కలగజేసుకుని వ్యాక్సిన్ వేయాల్సిందేనని తీర్పు చేయడంతో కొద్దిగా వెనక్కి తగ్గి వ్యాక్సిన్ వేస్తున్నట్టు చూపుతున్నారని అన్నారు.ఈ ప్రభుత్వ విధివిధానాలను మార్చుట కొరకు ఈ నెల 9న క్విట్ ఇండియా ఉద్యమం రోజున స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ముందు దీక్ష చేపట్టాలని,దీనికి కార్మికులు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని అని కోరారు .ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నబి,యాకయ్య,సిఐటియు నాయకులు వెంకటమ్మ,ఆలేటి కిరణ్,సుల్తానా,కృష్ణ గిరిజన సంగం నాయకులు వజ్జ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: