CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బాంసెఫ్,బుద్ధిష్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఘనంగా స్వామి నారాయణ గురూ జయంతి వేడుకలు

Share it:

 


భద్రాద్రి కొత్తగూడెం,ఆగస్టు 21 (మన్యం మీడియా)

శనివారం నాడు స్థానిక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం ప్రకృతి ఆశ్రమంలో బాంసెఫ్, బుద్ధిష్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో భారతదేశ సామాజిక విప్లవ కర్త, అక్షర జ్ఞానంతో నవసమాజ నిర్మాణానికి బాటలు వేసి గురువులకే గురువై నిలిచిన స్వామీ నారాయణ గురూ 166 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుద్ధిష్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు సిద్దెల రవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పౌరసంబంధాల అధికారి శీలం శ్రీనివాస రావు, స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ జగదీష్ (సిఐ ఏఆర్) విచ్చేసి మాట్లాడుతూ నేడు భారత దేశంలో కేరళా రాష్ట్రం అత్యధిక అక్షరాస్యత శాతం ఉండటానికి ప్రధాన కారణం 150 సంవత్సరాల క్రితం నారాయణ గురూ చేసిన త్యాగాల ఫలితమే అని అన్నారు. దేశంలో ఉన్న అసమానతలను మూఢ నమ్మకాలు రూపుమాపేందుకు విద్య ద్వారా మాత్రమే సాధ్యం అవుతుందని ప్రతి పల్లెలో పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యా విప్లవానికి నాంది పలికిన మహానుభావుడు స్వామి నారాయణ గురూ అని అన్నారు. అలాంటి త్యాగ మూర్తుల స్ఫూర్తిని నేటి యువతరానికి అందించాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమానికి బుద్ధిష్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు సిద్దెల రవి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా జిల్లా పౌరసంబంధాల అధికారి శీలం శ్రీనివాస రావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ దామోదర (సిఐ ఏఆర్), జిల్లా కార్యదర్శి కొచ్చెర్ల కమళా రాణి, జిల్లా కోశాధికారి పద్మావతి, టిఎం జేఏసీ రాష్ట్ర కార్యదర్శి మోదుగు జోగారావు, మాధవీలత, షబానా, నరాల రాజేష్, సంస్కృతి, అరుణ, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: