CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా కొమరం భీం విగ్రహ ఆవిష్కరణ

Share it:




 మన్యంటీవీ, అశ్వారావుపేట: 

ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్బంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, పేరాయిగూడెం గ్రామ పంచాయితీ లో అశ్వారావుపేట నియోజక వర్గ శాసన సభ్యులు మెచ్చా నాగేశ్వరావు చేతుల మీదగా కొమరం భీమ్ విగ్రహ ఆవిష్కరణ చేసారు. అనంతరం ఆదివాసీ జెండా ఎగరవేశారు. ఈ సందర్బంగా ఆదివాసీ దినోత్సవ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన మండల నాయకులందరకి కృతజ్ఞతలు తెలిపారు. గిరిజన భవనం నిర్మించుటకు కృషి చేస్తానని సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఆదివాసీ జాతి, సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహరాలను ఎప్పటికి మరువద్దని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి యువతపై ఉందని ఎంఎల్ఎ మెచ్చా అన్నారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు తగ్గుముఖం పడుతున్నాయని ఎంఎల్ఎ మెచ్చా ఆవేదన వ్యక్తం చేశారు. సొంత సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత చదువుకున్న నేటి యువతపై ఉందన్నారు. సొంత భాషను మరువద్దని, అవసరాలను బట్టి ఆంగ్లం, ఇతర భాషలను వాడాలన్నారు. ఈ కార్యక్రమం లో జడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి, ఎంపీపీ జల్లి పల్లి శ్రీరామూర్తి, సర్పంచ్లు నార్లపాటి సుమతి, అట్టం రమ్య, మొడియం కృష్ణవేణి, అశ్వారావుపేట నియోజక వర్గ నాయుకులు జారే ఆదినారాయణ, సంగా ప్రసాద్, గిరిజన నాయకులు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: