CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విద్యాసంస్థలు ప్రారంభించాలి.

Share it:

 *◆ప్రభుత్వ విద్యాసంస్థలలో మౌళిక వసతులు,టీచర్లను నియమించి విద్యార్ధులకు మాస్కులు, శానిటైజర్లను అందించి కోవిడ్ నిబంధనలు అమలు చేయాలి:


*◆ ప్రైవేట్ విద్యాసంస్థలలో ఫీజులు నియంత్రించి, ఫీజులను ప్రభుత్వమే నిర్దారించి వాయిదా పద్దతులోచెల్లించే చర్యలు తీసుకోవాలి:


*◆అర్హులైన విద్యార్ధులకు ఉచితంగా తక్షణమే వ్యాక్సీన్ అందించాలి :

 *ఎస్.ఎఫ్.ఐ. ములుగు జిల్లా అధ్యక్షుడు రవి


 *ఎస్ఎఫ్ఐ మంగపేట మండలం కన్వీనింగు కమిటీ ఎన్నిక


మన్యం టీవీ మంగపేట.

భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం రోజున  ఎస్ఎఫ్ఐ అంకానీ వీర్రాజు అధ్యక్షన సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా  ఎస్ఎఫ్ఐ ములుగు జిల్లా అధ్యక్షుడు తోకల రవి మాట్లాడుతూ    తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యా సంస్థలు అన్నింటిని ప్రారంభించాలి.గత రెండు సంవత్సరాలు నుండి చదువులు చక్కగా సాగక పేద విద్యార్ధులు మరి ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలలో చదువుతున్న విద్యార్ధులు తీవ్రంగా నష్టపోయారు.విద్యాసంస్థలు ప్రారంభిస్తే మళ్ళీ పేద విద్యార్ధులు చదువులు సాగేందుకు అవకాశం ఉంటుంది.అందుకోసమే విద్యాసంవత్సరాన్ని ప్రారంభించాలని ఎస్.ఎఫ్.ఐ. కోరుకుంటుంది.అయితే గత కోంతకాలంగా కరోనా విజృంభణ మనం చూశామ. ఈ పరిస్థితి ఇంకా తగ్గలేదని ఎస్.ఎఫ్.ఐ. భావిస్తుంది. కరోనా భయంతో విద్యార్థులు పూర్తిగా చదువుకు దూరం కాకుండా అన్ని విద్యాసంస్థలో ప్రభుత్వమే ఉచితంగా అర్హులైన విద్యార్థులకు వ్యాక్సీనేషన్ ప్రారంభించాలి.18-45 యేళ్ళ కేటగిరీలో కళాశాల,యూనివర్శీటీలు విద్యార్ధులు వస్తారు కాబ్బటి విద్యాసంస్థలలో వ్యాక్సీన్ కేంద్రాలు పెట్టి తక్షణమే వ్యాక్సీన్ అందించాలి.అలాగే విద్యాసంస్థలు ప్రారంభించడం అంటే హడావుడి కాకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రారంభించాలని కోరుతుంది.ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటీకీ పాఠ్యపుస్తకాలు పూర్తి స్థాయిలో అందుబాటులో లేవు.చాలామంది ఉపాధ్యాయులు పదవీవిరమణ పోందారు.టీచర్ పోస్టులు భారీగా ఖాళీలు అయ్యాయి.అ స్థానంలో కనీసం కోన్ని నెలల వరకు విద్యా వాలంటీర్స్ నియమించుకోవడం అయినా జరగాలి.ప్రతి పాఠశాలను గ్రామ పంచాయతీ పరిధిలోని ఐసోలేషన్ కేంద్రం చేయడం వల్ల కరోనా పేషంట్స్ చికిత్స పోందుతున్నారు.వారిని ఖాళీచేయించి పాఠశాలలు మరియు హస్టల్స్ శానిటేషన్ చేయించాలి. ప్రభుత్వ విద్యాసంస్థలో చదువుతున్న వారందరికీ ఉచితంగా మాస్కులు, శానిటైజర్స్ అందించాలి.కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలి. దీనితోపాటు గత రెండు సంవత్సరాలు నుండి ప్రభుత్వ విద్యాసంస్థలకు ఎలాంటి నిధులులేవు.స్వీపర్లు,అటెండర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చాలా విద్యాసంస్థలలో టాయిలెట్స్ సౌకర్యం లేదు. రన్నింగ్ వాటర్,మంచినీటీ వసతి లేవు.పోషకాహారం పెట్టలంటే ప్రభుత్వం మధ్యాహ్న భోజనానికి ఖర్చు చేసే నిధులు సరిపోవు.ఈ అంశాలన్నీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి. రేపటి భవిష్యత్ అయినా విద్యార్ధులను కాపాడుకోవాలి.

ప్రైవేట్ విద్యాసంస్థలలో ఇదే అదునుగా ఫీజులు దండుకునే అవకాశం ఉంది.పాత బకాయిలు పేర భారీగా ఫీజులు వసూళ్లుచేస్తున్నారు.దానికోసం కరోనా సమయంలో ప్రభుత్వం జారీ చేసిన జీ.వో.నెం: 46 ను అమలు చేసి వాయిదా పద్దతిలో బకాయిలు మరియు ఫీజులు తీసుకునే అవకాశం కల్పించాలి. ఫీజులను ప్రభుత్వమే నిర్ణయించాలి.

ఫీజులను నియంత్రించేందుకు కమిటీ ఏర్పాటు చేయాలి.

కమిటీ ఏర్పాటు చేసేంతవరకు ప్రత్యేక టాస్కు ఫోర్స్ ఏర్పాటు చేయాలి. ప్రైవేట్ విద్యాసంస్థలలో విద్యా వ్యాపారాన్ని నియంత్రించాలి.

ప్రతి పాఠశాలలో ఆరోగ్య కార్యకర్త ను నియమించి ప్రతిరోజు వారి ఆరోగ్యాని పరిక్షించాలి.ఈ చర్యలు తీసుకోవాలని ఎస్.ఎఫ్.ఐ కోరుతుంది.

ప్రభుత్వానికి ఎస్.ఎఫ్.ఐ.

 *ఈ 10  డిమాండ్లను అమలు చేయాలని ఎస్.ఎఫ్.ఐ.కోరుతుంది.*

1.విద్యాసంస్థలు అన్ని శానిటేషన్ చేయాలి.

2.పాఠ్యపుస్తకాలు అందించేంత వరకు పాత తరగతులు విద్యార్థులు మరచిపోకుండా రివిజన్ చేయించాలి.తక్షణమే పాఠ్యపుస్తకాలు అందించాలి.

3.ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు బర్తీ చేసి, భర్తీ అయ్యేంత వరకు తక్షణమే విద్యా వాలంటీర్స్ ను నియమించాలి.

4.మధ్యాహ్న భోజనానికి పోషకాహారం అందించేందుకు నిధులు పెంచి వారానికి 4 సార్లు గ్రుడ్డు, రెండు సార్లు పండ్లు అందించాలి.

5.ప్రతి ప్రభుత్వ విద్యాసంస్థలలో ఆరోగ్య కార్యకర్తను నియమించి,ప్రతిరోజు వారి ఆరోగ్యాన్ని పరిక్షించాలి.

6. ప్రతి ప్రభుత్వ విద్యాసంస్థలలో టాయిలెట్స్, మంచినీటి సౌకర్యం,హ్యాండ్ వాష్ సౌకర్యం కల్పించాలి.

7.ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు నియంత్రణకై చట్టం చేయాలి, నియంత్రణ కమిటీ నియమించాలి.

8.ఫీజులు పెంచకుండా పాత ఫీజులనే అమలు చేయాలని ,అది 4 లేదా 6 వాయిదాలో చెల్లించాలని ఇచ్చిన జీ.వో.నెం: 46 ను అమలు చేయాలి.

,సర్టిఫికేట్స్ ఇచ్చే సమయంలో పాత ఫీజులకోసం వేధించకుండా చర్యలు తీసుకోవాలి. టి.సి.లేకుండా ప్రవేశాలు పోందే అవకాశం కల్పించాలి.

9. అద్దె భవనాల్లో ఇరుకు గదుల్లో నడుస్తున్న వసతిగృహలు,గురుకులాలు ను వేరే ప్రభుత్వ భవనాలకు తరలించాలి.హస్టల్స్, గురుకులాల్లో ప్రతిరోజు పరిశుభ్రత కోసం చర్యలు తీసుకోని,ఎక్కువ సంఖ్యలో ముత్రశాలలు,స్నానాలు గదులు ఏర్పాటు చేయాలి.

10.18-45 సంవత్సరాలు వారికి అర్హులైన విద్యార్ధులందరికి వ్యాక్సీనేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి వ్యాక్సీన్ అందించాలి.

11. పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్, ఫీజురియాంబర్స్ మెంట్ విడుదల చేయాలి.   


ఎస్ఎఫ్ఐ మంగపేట మండల కన్వీనింగ్ కమిటీ ఎన్నిక

 మంగపేట మండల కన్వీనర్ సయ్యద్ షఫీ, 


కో కన్వీనర్ సప్పిడి శివకుమార్ 


,సభ్యులుగా  భాష, షారుక్ ,మహేష్ ,కేశవ్ ,రాజు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: