CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రపంచ ఆదివాసి దినోత్సవం ను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

Share it:

 


*తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ ఆదివాసి దినోత్సవం కు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి.

*తెలంగాణ ఆదివాసి విద్యార్థి సంఘం ప్రచార కార్యదర్శి గావి డి నాగబాబు డిమాండ్.

మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో శుక్రవారం ఆదివాసీ విద్యార్థి సంఘం ముఖ్య సమావేశం ఆదివాసీ విద్యార్థి సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు శ్రీ కాంత్ అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం ప్రచార కార్యదర్శి గావిడి నాగబాబు హాజరై మాట్లాడుతూ ప్రపంచం మొత్తం గా 476 మిలియన్ల పాపులేషన్ ఉండగా వివిధ రకాల తెగలు ఏడు వేల భాషలు మాట్లాడుతారు. ఇందులో రెండు వేల ఆరు వందల ఎనభై భాషలు అంతరించిపోయే దశలో ఉన్నాయి ప్రపంచ మొత్తంలో వివిధ తెగలు 5,000 రకాల భాష సంస్కృతి, సంప్రదాయాలు పరిరక్షించుకుంటూ కాపాడుకుంటున్నారు. ఇందులో భాగంగా 1982వ సంవత్సరంలో 179 దేశాల ప్రతినిధులు ఆదివాసీల రక్షణ కోసం ప్రణాళికలు వారి రక్షణ కోసం ఐక్యరాజ్య సమితి వర్కింగ్ గ్రూపు సమావేశం జరిగింది.ఆదివాసుల కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవ జరుపుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.ప్రత్యేకంగా ఆదివాసీల భాషల రక్షణ మానవ హక్కుల రక్షణకు దోహదపడుతుంది అని అన్నారు.ఆదివాసీల కోసం భారత రాజ్యాంగంలోని 12 షెడ్యూల్ 6,5 షెడ్యూలు సంస్కృతి సంప్రదాయాలు విద్య భాషలు వారి రక్షణ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా చోటు కల్పించడం జరిగింది. కానీ నేటికీ ఆదివాసీలు విద్య, వైద్యం,ఆర్ధిక,రాజకీయంగా వెనకబడి ఉన్నారు. ఏజెన్సీ ప్రాంతాలలో గూడెంలలో కు కరెంటు,గుడిసెలకు రోడ్డు సౌకర్యం అత్యవసర చికిత్స కోసం కనీసం అందుబాటులో ప్రాథమిక వైద్య శాలలు కూడా లేని దౌర్భాగ్య స్థితిలో జీవనం కొనసాగిస్తున్నారు,అని అన్నారు.ఇప్పటికే మన దేశంలో కేంద్ర రాష్ట్రాల ఆధునిక అభివృద్ధి పోకడలతో ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలు ధ్వంసం అవుతున్నాయని,ఆదివాసి తెగల భాషల రక్షణకు ప్రభుత్వాలు చొరవ తీసుకుని రక్షించాలని అలాగే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసి దినోత్సవం జరుపుకునే విధంగా తెలంగాణ రాష్ట్రంలోని 5వ షెడ్యూల్లో ఉన్న జిల్లా కలెక్టర్లకు,ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సర్క్యులర్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రతి  ఆదివాసి గూడెంలో ఆదివాసి ఆకుపచ్చ జెండాను ఎగురవేయాలని అన్నారు.ఈ సమావేశంలో నాయకులు ఈసం సందీప్, బచ్చల నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: