CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అనారోగ్యాలతో కునారిళ్లుతున్న భుచ్చంపేట

Share it:

 



*అప్పుడు కరోనా మహమ్మారి ఇప్పుడు డెంగ్యూ మలేరియా


*చోద్యం చూస్తున్న అధికారులు




మన్యం టీవీ మంగపేట.


ములుగు జిల్లా మంగపేట మండలం బుచ్చంపేట గ్రామంలో పక్షం రోజులుగా డెంగ్యూ,మలేరియా జ్వరాలతో అక్కడి ప్రజలు మంచాన పడ్డారు.ఊరు ఊరంతా మొన్నటి వరకు వందకు పైగా కరోనా పాజిటివ్ కేసులతో జన జీవనం అతలా కుతలం కాగా, నేడు అదే గ్రామంలోమలేరియా,డెంగ్యూ దోమలు ప్రబలడంతో చిన్నా పెద్దా, వృద్ధులంతా కూడా సీజనల్ వ్యాధులు సోకి తల్లడిల్లుతున్నారు.ప్రజలందరూ కూడా ఏడాదిన్నర కాలంగా చాలా వరకు ఏదో రకమైన దీర్ఘకాలిక, స్వల్పకాలికఆనారోగ్యలతో, ఆర్థికంగా,శారీరకంగా కృంగిపోయారు,కరోనా ప్రబలుతున్న సమయంలో తప్ప ,ఇప్పుడు ఏ అధికారులుపట్టించుకోవడం లేదని, ఒక వేళ పట్టించుకున్నా తూతూ మంత్రంగానే అలావచ్చి ఇలా వెళ్లారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.ముఖ్యంగా పాలకులలో ఎమ్మేల్యే సీతక్క వచ్చి ఎంతోకొంత సహాయం చేసి వెళ్ళారన్నారు.సరే ఏదో ఒకలాగా కరోనా నుండి బయట పడ్డాం అనుకునే లోపే మళ్ళీ మలేరియా, డెంగ్యూ మహమ్మారి మా ఊరుమొత్తాన్ని పట్టి పీడిస్తుందని, ఇంటికి ఇద్దరు చొప్పున జ్వరాల బారిన పడి ఆరోగ్యంగా,ఆర్థికంగా నలిగిపోతున్నారన్నారు. రోజుకు ఒక 10 మంది అయిన హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారన్నారు,ఇప్పటికే సీరియస్ గా వుండి 10 మంది వరంగల్ లో ప్రవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయినారన్నారు,ఊరు మొత్తం ఇదే విధంగా జ్వరంతో చస్తు ఉంటే కనీసం వైద్య అధికారులు కానీ,పాలకులు కానీ,అధికారులు కానీ పట్టించుకోవడం లేదని, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక నలిగి పోతున్నామన్నారు. ఊరు ఊరంతా,ఊర్లోకి వచ్చే ఏ.ఎన్. ఎం,ఆశా వర్కర్స్ ని అడిగితే గతంలోనే దోమతెరలు ఇచ్చినం కదా.. మీరే సరిగా వాటిని ఉపయోగించుకోవడం లేదు పైగా మాపై ఆరోపణలు చేస్తున్నారా..అంటున్నారన్నారు, పై అధికారులకు చెబుతాం అంటున్నారు. కానీ ఇంతవరకు ఎలాంటి ఉపయోగం లేదు,డెంగ్యూ దోమ పగలు సమయాలలో మాత్రమే కుడుతుందన్న విషయం కూడా వాళ్లకు తెలియదు అనుకుంటా, ఒకవేళ తెలిస్తే పగలు కూడా దోమ తెరలు కప్పుకుని లేదా చుట్టుకొని తిరగమంటారేమోనని గ్రామస్తులుపేర్కొంటున్నారు. ఇంత నిర్లక్ష్య ధోరణిని ఇకనైనావైద్యఅధికారులు,పాలకులు,ప్రభుత్వ అధికారులువీడనాడి,తగిన రీతిలో స్పందించాలని వారు కోరుతున్నారు.దయచేసి మా ఊరిని కాపాడండి..సర్ చచ్చిపోతున్నాం కొంచం మీరైనా పత్రికల్లో మా పరిస్థితిని వేసి మాప్రాణాలను నిలబెట్టండి అని అక్కడికెళ్లిన పాత్రికేయులని గ్రామస్థులు ప్రాధేయపడవలసిన దుస్థితి అక్కడ నెలకొంది.

Share it:

Post A Comment: