CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గ్రామ గ్రామాన వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి

Share it:

 



*వీధులలో బ్లీచింగ్ చల్లడం లేదు, పాగింగ్ చేయడం లేదు

*అధికారుల నిలువెత్తు నిదర్శనానికి ప్రతీక ఈ విష జ్వరాలు

కాంగ్రెస్ నాయకులు పల్లికొండ యాదగిరి.


మన్యం టీవీ మంగపేట.


 ప్రతి గ్రామంలో ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్నారు.ప్రజలు విష జ్వరాల భారిన పడకుండ గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి టెస్టులు చేయాలని అదే విదంగా గ్రామాల్లో శానిటేషన్ పనులు చేయకుండ గ్రామ పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ మండల అధ్యక్షుడు పల్లి కొండ యాదగిరి అన్నారు.వేల రూపాయలు వెచ్చించి ప్రభుత్వం గ్రామ పంచాయతీ లకు మందు పిచికారీ యంత్రం దోమల నివారణకు ఫాగింగ్ చేయడానికి పొగ యంత్రాలు ఇస్తే వాటిని ఉపయోగించడం లేదని బ్లీచింగ్ పౌడర్ మెయిన్ రోడ్డుకు ఇరు పక్కల జల్లు తున్నారు కానీ నీళ్లు నిలువ ఉండి దోమల ఈగలు ఎక్కువగా ఉండే బురదగా ఉన్న వీ ధులలో చల్లడం లేదని దానితో అక్కడ నివాసం ఉంటున్న వారు దోమలు ఈగలు దుర్వాసన సమస్యతో విష జ్వరాల బారిన పడుతు న్నారని నీళ్లు నిలువ ఉండి ఎక్కడ వేసిన చెత్త అక్కడే ఉండి దుర్వాసన దోమలతో సీజనల్ వ్యాధులకు గురైయ్యే అవకాశం ఉందని వైద్య అధికారులు గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి రక్త పరీక్షలు నిర్వహించాలని గ్రామ పంచాయతీ అధికారులు నీళ్లు నిలువ ఉన్న దగ్గర బ్లీచింగ్ పౌడర్ చల్లి శానిటేషన్ పనులు చేసి ఇంటి ఇంటికి వెళ్లి ఆరోగ్య పరీక్షలు జరిపి గ్రామాల్లో పర్యటించలని పందులు విచ్చల విడిగా విధుల్లో తీరడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారని పేర్కొన్నారు. గ్రామంలో వైద్య అధికారులు ప్రజలు సీజనల్ విష జ్వరాల బారిన పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ అధ్యక్షుడు పల్లికొండ యాదగిరి డిమాండ్ చేస్తున్నారు.

Share it:

Post A Comment: