CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కామ్రేడ్ పొట్లపల్లి శ్రీ శైలం గారికి విప్లవ జోహార్లు: న్యూడెమోక్రసీ

Share it:

 



మన్యం టీవీ మణుగూరు: సిపిఐ ఎంఎల్, న్యూడెమోక్రసీ ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులు, ఖమ్మం డివిజన్ ఉద్యమ నిర్మాణంలో కీలకంగా పనిచేసిన సుదీర్ఘ విప్లవ పోరాటాల బాటసారి కామ్రేడ్ పోట్లపల్లి.శ్రీశైలం మరణం విప్లవ ప్రతిఘటన పోరాటాలకు తీరనిలోటని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మణుగూరు సబ్ డివిజన్ కార్యదర్శి మోర.రవి అన్నారు. మణుగూరు మండలం విజయనగరం గ్రామంలో సీనియర్ నాయకులు దుబ్బాక జగ్గన్న అధ్యక్షతన కామ్రేడ్ పోట్లపల్లి.శ్రీశైలం సంతాపసభ జరిగింది.ఈ సందర్భంగా మోర.రవి మాట్లాడుతూ,కామ్రేడ్ శ్రీశైలం ఈ రోజు ఉదయం 3.15 సమయంలో ఖమ్మం ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారని తెలిపారు. సీనియర్ నాయకులు, మొదటి ఖమ్మం డివిజన్ పార్టీ కమిటీ సభ్యులు, మొదటి అరుణోయ భాద్యులు,మొదటి ఏపిఆర్ సిఎస్ రాష్ట్ర కోశాధికారి రామనర్సయ్య,నగర భూపోరాట వ్యూహకర్త, భూమి లేని వారిని సమీకరించి పోడు కొట్టించి భూములు పంచి అమరవీరుల పేర రామనర్సయ్య నగర్,విక్రం నగర్,ఎల్లన్ననగర్,గ్రామాల ఏర్పాటు లొ కీలక పాత్రదారి శ్రీ శైలం అని కొనియాడారు. నాటి ఖమ్మం డివిజన్ లో పార్టీ ప్రజాసంఘాలు గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా అభివృద్ధి కావడానికి కృషి చేస్తున్న క్రమంలో ప్రత్యర్ధుల దాడులను ఎదిరించి నిలబడిన యోధుడు. భూస్వాములకు,పెత్తందార్ల కు వ్యతిరేకంగా పోరాటం జరుగుతున్న కాలంలో 1980 లో ఖమ్మం డివిజన్ పార్టీ మహసభ కీలకమైనది.పార్టీ డివిజన్ కమిటీ తిరిగి ఎన్నికైన ఐదుగురులో ఒకరనీ అన్నారు.సారాకు వ్యతిరేకంగా జరిగిన వివిధ సందర్భంగా జరిగిన పోరాటంలో తన స్వగ్రామమైన వేపకుంట్లను ప్రత్యేక తరహాలో నిలబెట్టిన తీరు మరువలేనిది అన్నారు.సారా బహిష్కరణ చేయించి రాజ్యాం కోపానికి గురైనారనీ తెలిపారు. ఖమ్మం డివిజన్ లొ అనేక గ్రామాల్లో రాజకీయ ముఠా కొట్లాటకు అలవాలమైన స్థితిలో ఖమ్మం డివిజన్ పార్టీ కమిటీ ప్రజలను ప్రత్యేక తరహ పోరాటాల వైపు మళ్ళీంచిన ప్రతి సందర్బంలొ కూడా, నిర్ణయాలు చేసే క్రమంలోనూ వాటి అమలులోను కీలకంగా వ్యవహరించారని తెలిపారు.అత్యవసర పరిస్థితి కాలంలో నెలల తరబడి పోలీసులు కష్టడిలొ తీవ్ర నిర్బంధానికి గురయ్యారని తెలిపారు. సుదీర్ఘ కాలంగా విప్లవ రాజకీయ కార్యక్రమాల్లొ భాగస్వామిగా ఉన్న సీనియర్ కామ్రేడ్ పొట్లపల్లి. శ్రీశైలం మరణం విప్లవోద్యమానికి తీరనిలోటని అన్నారు. శ్రీశైలం పీడిత ప్రజల మనిషి అని,ఆయన మన నుంచి భౌతికంగా విడిపోవడం నమ్మలేని నిజం అని కామ్రేడ్ శ్రీశైలం గారి ఆశయాలను కొనసాగిస్తామనీ తెలిపారు. ఆ కామ్రేడ్ కి సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మణుగూరు సబ్ డివిజన్ కమిటీ విప్లవ జోహార్లు అర్పిస్తుందని,వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామనీ అన్నారు.ఈ కార్యక్రమంలో అఖిలభారత రైతుకూలి సంఘం మండల నాయకులు కంపెర్ల పెద్దసూర్యం,మల్లికంటి.రాము,మైపా.పెద్దరాంబాబు, అచ్చయ్య,అలివేలు,రామకృష్ణ,రాంబాబు,సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: