CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ భూనిర్వాసితులకు అండగా ఉంటాను :- భద్రాచలం శాసనసభ్యులు, టీపీసీసీ ఉపాధ్యక్షులు పొదెం వీరయ్య..

Share it:

 



 మాన్యం టివి దుమ్ముగూడెం: మండలంలోసున్నంబట్టి ,కాసినగరం గ్రామాల్లో వేర్వేరు సభలో భద్రాచలం శాసనసభ్యులు పొందేం మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టినప్పుడు ముందుగా క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పూర్తిగా తీర్చకుండా ఇక్కడ జరిగిన గ్రామ సభలో తీర్మాణాలు  అమలు పరచకుండా చాలీచాలని ప్యాకేజీలతో అమాయక రైతుల పొట్ట లు కొడుతూ ఉంటానంటే మేము చూస్తూ ఊరుకోబోమని, ఎంతటి పోరాటానికైనా మేము సిద్ధమని గత శాసనసభ సమావేశాలలో సీతమ్మ సాగర్ భూనిర్వాసితుల సమస్యల గురించి వారికి ఇచ్చే ప్యాకేజీల గురించి సుదీర్ఘంగా ఎంత మాట్లాడినప్పటికీ కనీసం ప్యాకేజీ విషయంలో కూడా న్యాయం చేయలేని పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఆ పరిస్థితుల్లో గిరిజన ప్రాంతాల్లో ప్రాజెక్టులు కట్టి జనాలను మోసం చేసే స్థితి ప్రభుత్వానికి ఎందుకని మేము ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా కాదని కానీ ఇక్కడ రైతులకు ఉన్న సమస్యలన్నీ తీర్చిన తరువాత ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు మొదలు పెట్టాలని ఇంకా ఉధృతంగా ఈ పోరాటం నేటినుంచి సాగిస్తామని , ఈ ప్రాంతాలలో రెవెన్యూ రికార్డుల్లో భూయజమానులకు సంబంధించి భూమి ప్రస్తుతం సాగు చేసుకునే లబ్ధిదారుల పేర్లు లేక చాలా సమస్యలు అట్లనే వస్తూ ఉంటే అధికారులు ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితులు నెలకొన్నాయని, ఇది మంచి పరిణామం కాదని  భద్రాచలం శాసన సభ్యులు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు శ్రీ పొదెం వీరయ్య  పునరుద్ఘాటించారు .ఈ కార్యక్రమాలలో స్థానిక ఎమ్మెల్యే గారితో భద్రాచలం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ నల్లపు దుర్గా ప్రసాద్ , సిపిఎం పార్టీ జిల్లా నాయకులు ఎలమంచిలి రవి కుమార్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు చింత్రియాల రవికుమార్ , దుమ్ముగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లంక శ్రీనివాసరావు , పిలక వెంకటరామిరెడ్డి,  దర్శి సాంబశివరావు ,నారాయణ మూర్తి , రామ చిట్టి,  వేముల వెంకటేశ్వర్లు ,  తోట మల్ల సంగీతరావు, హరికృష్ణ ,వేణు లంక శివ ,మరియు టిడిపి సిపిఎం పార్టీ నాయకులు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: