CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గోదారి ముంపు ప్రమాదం లో పొదుమూరు గ్రామస్తులు

Share it:

 



*హామీలు ఇచ్చారు అమలు మరిచారు


మన్యం టీవీ మంగపేట.


మంగపేట మండలం పొదుమూర్ గోదావరి ముంపు ముప్పు ఉండటం వలన మీ అందరికి ఇండ్లు కట్టించి ఇచ్చే బాధ్యత నాది అని ములుగు జిల్లా చైర్మన్ కుసుమ జగదీష్ పత్రిక పూర్వకంగా మరియు టివి న్యూస్ లో కూడా చెప్పడం జరిగింది. తర్వాత జిల్లా నాయకులు, మండలం నాయకులు అందరూ కూడా హామీలు గుప్పించి పొదుమూరు గ్రామ ప్రజలను ఆనందంలో విహరింపజేశారు.అకినేపల్లి మల్లారం శ్రీధర్ వర్మ,కుడుములు లక్స్మినారాయణ,వైకుంఠం, ఆయుబు, బుట్టో, నూనె లింగయ్య తదితరులు వచ్చి పొదుమూర్ గ్రామ ప్రజలతో మీకు మోడల్ బెడ్ రూమ్ లు కట్టిస్తాము అని చెప్పామన్నారు. ములుగు జిల్లా చెర్మెన్ కుసుమ జగదీష్ ఇలా చెప్పారు మీకు ఇండ్లు కఠిస్తే ఈ ఇండ్లు వదిలి వెల్లుతారా అని అడిగినారు.పొదుమూర్ గ్రామ ప్రజలు కూడా మేము మా పాత ఇండ్లు వదిలి వెల్లుతాము అని చెప్పారు చెప్పి ఇప్పటికి మూడు నెలలు అవుతుంది కాని ఇంతవరకు మాకు ఏమి చెప్పలేదు చేయలేదు. కుసుమ జగదీష్ మా పొదుమూర్ లో నివశిస్తున్న వారి పేర్లు ఆధార్ నెంబర్ మరియు ఇంటి నెంబర్ తో సహా పేర్లు రాసి ఇవ్వడం కూడా జరిగింది. ఈ సందర్బంగా తెలంగాణ ముఖ్యమంత్రి కూడా మాట్లాడడం జరిగింది అని కూడా చెప్పారు కుసుమ జగదీశ్ చెప్పారు.మళ్ళీ వర్షాలు కురుస్తునవి మళ్ళీ గోదావరి వస్తే పొదుమూర్ గ్రామ ప్రజలు అల్ల కల్లోలం అవుతాము మాకు గోదావరి ముప్పు రాకముందే మాకు తొందరగా ఇట్టి స్థలాలు ఇచ్చిన అక్కడ మేము గుడిసెలు వేసుకొని మా ప్రాణాలను కాపాడుకుంటాము. అని ఈ సందర్బంగా మంగపేట మండల ఇంచార్జి గుగ్గిళ్ల సురేష్ మాదిగ పత్రిక పూర్వకంగా తెలియ చేససారు.ఈనెలలో ఇవ్వక పోతే గోదావరి ముప్పు ప్రాంతం గ్రామ ప్రజలు రోడ్ల మీద రాస్తా రోకోలు చేస్తారు అని గ్రామ ప్రజలు పత్రిక పూర్వకంగా తెలంగాణ ప్రభుత్వానికి తెలియ జేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో లంజపెళ్లి గంగమ్మ, ఇసoపెల్లి చిలుక, గుండెట్టి సమ్మక్క, లంజపెళ్లి నారాయనమ్మ,లంజపెళ్లి నర్సమ్మ,కాట ఆదిలక్ష్మి,దాసరి సమ్మక్క,కొలుకుల సత్యమ్మ,బేత నర్శింహారావు,గుండెట్టి జంపయ్య, లంజపెళ్లి పున్నారావు,లంజపెళ్లి ఆదినారాయణ, తదితరులు గ్రామ మీటింగ్ లో మాట్లాడడం జరిగింది.

Share it:

Post A Comment: