CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆత్మ నిర్బర్ భారత్ పథకాన్ని పరుగులు పెట్టించండి....

Share it:

 



 మిర్చి పసుపు రైతులను ఆదుకోండి....


 జాతీయ సి టి ఎఫ్ సి చైర్మన్ జీవీఎల్ నరసింహారావుకి వినతి...


 జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ మెంబర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి


మన్యం టీవీ మంగపేట.


దేశవ్యాప్తంగా అమలవుతున్న ఆత్మ నిర్బర్ భారత్ పథకాన్ని తెలుగు రాష్ట్రాల్లో పరుగులు పెట్టించి వివిధ పథకాల ద్వారా వ్యవసాయ మరియు అనుబంధ రంగాలకు నిధులు విడుదల చేయాలని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ మెంబర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ మరియు ఎంపీ జీవీఎల్ నరసింహారావు ను కోరారు.మంగళవారం ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా నడికుడి లో జరిగిన జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో సాంబశివ రెడ్డి పాల్గొని తన వాణిని బలంగా వినిపించారు. ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ.సుగంధ పంటలు సాగు చేస్తున్న రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం స్పైసెస్ బోర్డ్ ద్వారా సాయం అందించాలని అదేవిధంగా సుగంధ పంటలకు సంబంధించిన మినీ ప్రాసెసింగ్ యూనిట్లను స్థాపనకు 90 శాతం రాయితీపై మంజూరు చేయాలని అన్నారు. సుగంధ పంటల రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ లేఖను సాంబశివ రెడ్డి రాజ్యసభ ఎంపీ జీ వి ఎల్ కి అందజేశారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సుగంధ పంటలుగా మిర్చి పసుపు పంటలను రైతులు సాగు చేస్తున్నారని ఈ రైతాంగానికి రైతు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం తో పాటు ఈ - స్పైస్ బజార్ పథకాన్ని అమలు చేయాలని కోరారు మిర్చి రైతులకు ఐ పీ ఎమ్ కిట్లు ఉచితంగా అందజేయాలని సేంద్రియ సాగు ని ప్రోత్సహించాలని ముఖ్యంగా మిర్చి పసుపు రైతులకు టార్పాలిన్ సీట్లు శిల్పాలిన్ సీట్లు సబ్సిడీపై మంజూరు చేయాలని మిర్చి లో విల్ట్ వైరస్ తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకునే నూతన మిర్చి వంగడాల విత్తనాలను సరఫరా చేయాలని సాంబశివారెడ్డి ఛైర్మన్ జి వి ఎల్ నీ కోరారు. వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు మరియు జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ జివిఎల్ నరసింహారావు హామీ ఇచ్చారు. రైతు శిక్షణా కార్యక్రమాలను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు కృష్ణదేవరాయలు గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి స్పైసెస్ బోర్డు రీసెర్చ్ డైరెక్టర్ శ్రీమతి రమాశ్రీ తెలంగాణ వరంగల్ డి డి డాక్టర్ గాధి లింగప్ప గుంటూరు స్పైసెస్ బోర్డు డి డి శ్రీమతి పద్మజ మరియు జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలోని మిర్చి పసుపు ఎక్స్ పోర్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: