CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జూలూరుపాడు లో ఘనంగా ఏఐఎస్ఎఫ్ 86వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

Share it:

 


👉 ఏఐఎస్ఎఫ్ పతాకాన్ని ఆవిష్కరించిన చండ్ర నరేంద్ర కుమార్..


మన్యం టీవీ : జూలూరుపాడు, ఆగస్టు 12, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ 86వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చండ్ర నరేద్రకుమార్ మాట్లాడుతూ.. దేశంలో శాస్ట్రీయ విద్యా విధానం, కామన్ విద్యా విధానం, కోసం బడుగు బలహీన వర్గాలకు విద్యా అవకాశాలు కల్పించాలని, విద్య ప్రవేటికరణ కార్పొరేటీ కరణ కాషాయ కరుణకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించిన ఘనమైన చరిత్ర ఏఐఎస్ఎఫ్ కి వున్నదని, స్వతంత్ర పోరాటంలో విరోచితంగా పోరాడిన, భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్, లాంటి దేశభక్తులను అందించిన సంఘం వారి స్ఫూర్తితో విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. సిపిఐ మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్రభుత్వాలు విద్యారంగాన్ని నీరు కారుస్తూ దేశంలో ప్రైవేటు యూనివర్సిటీల ను నూతన విద్యా విధానం తీసుకువచ్చి పేద, మధ్య తరగతి, విద్యార్థులకు విద్యను అందని ద్రాక్షగా పాలకులు మారుస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణాలకు తెగించి పోరాడిన విద్యార్థి నేతలపై అక్రమ కేసులు పెట్టి ప్రశ్నించే గొంతు నొక్కు తున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థి వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థుల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు షేక్ నాగుల్ మీరా, ఏఐఎస్ఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.కె చాంద్ పాషా, ఏఐఎస్ఎఫ్ మాజీ మండల కార్యదర్శి ఎస్.కె కాసిం, మండల నాయకులు గుగులోత్ వంశీ, రాము, రమేష్, వెంకటేష్, దేవేందర్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: