CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 77వ జయంతి వేడుకలు.

Share it:

 


కరకగూడెం మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ జన్మదినం సందర్బంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ కరకగుడెం మండల అద్యక్షులు & ఏ బ్లాక్ కోఆర్డినేటర్ సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్


మన్యం టీవీ కరకగూడెం.

రాజీవ్ గాంధి 77 వ జన్మదినం సందర్బంగా కరకగూడెం మండలం కేంద్రంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం సయ్యద్ హుస్సేన్ ఇక్బల్ 

ఈ సందర్భంగా మాట్లాడుతూ 

భారతదేశాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి

చేసిన ధృవతార ఐటి రంగానికి పునాదులు వేసిన మార్గదర్శి, నిరుపేదలకు అండగా నిలిచిన ఆపద్భాందవుడు యువతకు 18 ఏళ్ళకే ఓటు హక్కును కల్పిస్తూ యువత రాజకీయాల్లో చురుకుగా పాల్గొనేలా చేసిన సంస్కరణ కర్త రాజీవ్ గాంధీ అని

భారతదేశ సాంకేతిక అభివృద్ధి ఆద్యుడు, పరిపాలనలో సంస్కరణలు తెచ్చిన నాయకులు, దేశ సౌభ్రతృత్వం కాపాడటం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన మహనీయులు, నవ భారత నిర్మాత, భారతరత్న దివంగత ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ అని తెలియజేసారు.

ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికిన పాలనాధ్యక్షులు, భారత రత్న, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆ మహానీయుడికి ఘనంగా నివాళులు ఆర్పిస్తూ ప్రతి పేద వాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు అని సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ కొనియాడారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసి, ఆసుపత్రి సేవలపై ఆర తీశారు.

ఈ కార్యక్రమంలో కరకగూడెం మండల ప్రధాన కార్యదర్శి నాగబండి వెంకటేశ్వర్లు, యువజన అధ్యక్షులు కునుసొత్ సాగర్,షేక్ రఫీ,చందా లక్ష్మినారాయణ పేష్కారి తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: