CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

3 వ రోజు ప్రారంభమైన పోడు భూముల పోరుయాత్ర

Share it:


👉 హాజరైన పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు

పోడు భూముల రక్షణకై గత మూడు రోజుల నుండి సి.పి.ఐ.ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ చేస్తున్న పోరు యాత్రను ఆ పార్టీ రాష్ట్ర నాయకులు గోకేనేపల్లి వెంకటేశ్వర రావు పోరుయాత్ర ను పాత గంగారంలో ఉదయం 10 గంటలకు జెండా ఊపి ప్రారంభించారు. మద్యహ్నం 2 గంటలకు ములకలపల్లి సెంటర్ కి చేరుకుంది.పోరు యాత్రలో హాజరైన పార్టి రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ పోటు రంగారావు మాట్లాడుతు,ఆదివాసీల అనేక పోరాటాల ఫలితంగా2006 అటవీ హక్కుల చట్టం వచ్చిందని,కాని కేంద్రంలో,రాష్ట్రంలో అదికారాల్లో వున్నటువంటి ప్రభుత్వాలు వాటిని అమలు చేయ్యకపోగ చట్టాన్ని ఉల్లఘిస్తు అమయాక ఆదివాసీలపై కృరంగా వ్యవహరిస్తు,అక్రమ కేసులు పెడుతు వారిని అనేక రకాలుగా ఇబ్బందుల పాలు జేస్తున్నారని,చట్టం ప్రకారం పట్టాలు ఇవ్వకుండా అనేక సంవత్సరాలుగా సాగుచేసుకుంటున్న భూములలోకి ఫారెస్టు మరియు పోలిసు అదికారులు ప్రవేశించి, ఆదివాసీలపై దౌర్జన్యం చేస్తున్నారని,బ్రతకాటానికి ఎకరం, రెండు ఎకరాల పోడు భూములు సాగు చేస్తుంటే వీరి పై కక్షగట్టి అనేక ఇబ్బందుల పాలుజేస్తున్నారని,మరో ప్రక్క ఓపెన్ కాస్ట్ లపేరుతో లక్షలాది ఎకరాల భూములను బొందల గడ్డలుగా మారుస్తున్నారని ఆయన అన్నారు.ఉమ్మడి ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం‌ రామనర్సయ్య నగర్ లో మొత్తం 23 మంది పై పోడు భూముల గొడవలో అక్రమ కేసులు పెట్టి పసి పిల్లలను సైతం జైల్లలోకి పంపారని,ఇది మరి నిరంకుశమని ఆయన అన్నారు.ఇప్పటికైన ప్రభుత్వాలు ఈ నియంత పోకడలను విడనాడి ఆదివాసీలు,ఇరత పేదలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు హక్కు పత్రాలు కల్పించి వాటికి రైతు బందు,రైతు భీమ వర్తింపజేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.అదేవిదంగా ఆగష్టు 9వ తారీకు ఆదివాసీ దినోత్సవం రోజున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యలయం ముందు పోడు భూముల సమస్యలపై వేలాది మందితో ధర్నా కార్యక్రమం ఉంటుందని దీనికి ఆదివాసీలు,పేదలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చెయాలని పిలుపు నిచ్చారు.

*పోరుయాత్రకు సంఘీభావం* పోరుయాత్రకు తెలుగుదేశం పార్టీ జగన్నాధపురం ఎంపిటిసి సున్నం సునితా,కాంగ్రేస్ పార్టి మండల అద్యక్షులు పెటేటి నర్సింహారావు,లు సంఘీభావం తెలిపారు.

ఈ పోరు యాత్రలో పార్టీ డివిజన్ కార్యదర్శి అమర్లపుడి రాము,జిల్లా నాయకులు ముద్దా బిక్షం,నూపా భాస్కర్,కల్లూరి కిషోర్,పోతుగంటి లక్ష్మణ్,జి ప్రభాకర్,మండల నాయకులు కుంజా కృష్ణ,యర్రగొర్ల రామారావు,కుంజా లక్ష్మణరావు,తాటి తిరుపతయ్య,రాచన్నగూడెం సర్పంచ్ కొర్సా గణపతి,గుండాలపాడు సర్పంచ్ కారం కుమారి,ఎంపిటిసి లు నూపా సరోజని,మడకం విజయ,పి.డీ.ఎస్.యు నాయకులు కారం సంద్య,సిఎల్ సి జిల్లా నాయకులు బండారు నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: