CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సెప్టెంబర్ 2 న ఢిల్లీలో తెలంగాణ భవన్ కు శంకుస్థాపన

Share it:

 



అదే రోజున తెలంగాణ వ్యాప్తంగా జెండా పండుగ సంబరాలు

ప్రతి పంచాయతీలో జెండా ఎగురవేయాలి


ఎమ్మెల్యే రేగా ఆదేశాలతో పిలుపునిచ్చిన పినపాక మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి


మన్యం మనుగడ, పినపాక:


 సెప్టెంబర్ 2వ తారీఖున దేశరాజధాని ఢిల్లీలో తెలంగాణ భవన్ కు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాలు జరుగుతున్నందున, ఈ సందర్భంగా తెలంగాణలోని ప్రతి పంచాయతీలో జెండా పండుగ కార్యక్రమం జరుపుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలియజేయగా, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాలతో జండా ఎగురవేయడానికి సంబంధించినసన్నాహక సమావేశం టిఆర్ఎస్ పార్టీ పినపాక మండల అధ్యక్షుడు పడాల సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ,ప్రతి గ్రామానికి జెండా పండుగ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో జరగాలని, ఈ పండగ నిర్వహణ కోసం కమిటీలను కూడా ఏర్పాటు చేశామని, ప్రతి పంచాయతీలో తూచా తప్పకుండా పార్టీకి సంబంధించిన జెండాను ఎగురవేసి, టిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేసే విధంగా గా ఉండాలన్నారు. అనంతరం పినపాక మండలం ఎంపీపీ గుమ్మడి గాంధీ మాట్లాడుతూ, తూతూ మంత్రంగా జెండా ఎగురవేసే కార్యక్రమం పెట్టుకోకుండా, బాధ్యతతో కూడి పంచాయతీలో పార్టీ కార్యకర్తలను,అభిమానులను క్రోడీకరించి జెండా పండుగ మంచి వాతావరణంలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ రవి వర్మ మాట్లాడుతూ, వారి వారి ప్రాంతాలకు కేటాయించిన ప్రతినిధులు సమయానికి సదరు పంచాయతీకి వెళ్లి, జెండాను సకాలంలో ఎగరవేసే దిశగా అడుగులు వేయాలని, అభిమానులను, కార్యకర్తలను ఎక్కువ సంఖ్యలో పాల్గొనే విధంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పంచాయతీల వారీగా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జెండాలను, ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పినపాక మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దొడ్డ శ్రీనివాసరెడ్డి,ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వైస్ చైర్మన్ బత్తుల వెంకటరెడ్డి, సొసైటీ డైరెక్టర్ రాము, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు బొలిశెట్టి నరసింహారావు, కోలేటి భవాని శంకర్, దాట్ల వాసు బాబు, పినపాక మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు సోంపల్లి తిరుపతి, రాయల సత్యనారాయణ, వాసం స్వాతి, ఎంపీటీసీలు, వివిధ పంచాయతీల సర్పంచులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.

Share it:

Post A Comment: