CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సెప్టెంబర్ 2 టిఆర్ఎస్ జెండా పండుగ...

Share it:

 



మన్యం టీవీ,బూర్గంపాడు:


తెలంగాణ రాష్ట్రం కోసం.. 

కేసీఆర్ గారు ఎత్తిన గులాబి జెండా..

కోట్ల మందిని కదిలించింది.

స్వరాష్ట్రాన్ని సాధించింది.

రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నిలబెట్టింది.


ఇది రాజకీయ పార్టీ జెండా కాదు.. 

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుటా!!


ఢిల్లీలో ఎగరనున్న తెలంగాణ జయ పతాక


సెప్టెంబర్ 2 వ తారీఖు దేశ రాజధాని ఢిల్లీ లో  గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ చేతుల మీదుగా  తెలంగాణ రాష్ట్ర సమితి కేంద్ర పార్టీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు..


సరిగ్గా ఇరవై ఏండ్ల క్రితం జలదృశ్యం నుంచి ఒక్క అడుగుతో ప్రారంభమైన టిఆర్ఎస్ పార్టీ ప్రస్థానం...ఈ నెల 2 వ తారీఖు ఢిల్లీలో జయపతాకను ఎగురవేయబోతున్నది...


ఒకప్పుడు ఏ అస్తిత్వం  కోసం ఢిల్లీ వీధుల్లో తెలంగాణ సమాజం గుండె చప్పుళ్ళు ప్రతిధ్వనించాయో.. ఇప్పుడు అవే వీధుల్లో మన ఆత్మగౌరవ పతాకం ఆకాశమంత ఎత్తుకు ఎగురబోతున్నది...


 

 కావున ఈ ఉద్విగ్న ఆనంద  సమయాన సెప్టెంబర్ 2 వ తారీఖు ఉదయం బూర్గంపహాడ్ మండలంలోని  తెలంగాణ రాష్ట్ర సమితి  జడ్పిటిసి, సర్పంచులు,సొసైటీ చైర్మన్.. డైరెక్టర్లు,రైతు సమన్వయ సమితి అధ్యక్షులు,సభ్యులు.. మాజీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు.... గ్రామపంచాయతీ వార్డు మెంబర్లు...  టిఆర్ఎస్ పార్టీ నాయకులు..అనుబంధ సంఘాల నాయకులు...పార్టీ కార్యకర్తలు...యువజన నాయకులు... సోషల్ మీడియా సభ్యులు... అభిమానులు.. ప్రతి ఒక్కరు జెండా పండుగ కార్యక్రమంలో పాల్గొని  విజయవంతం చేయాలని కోరుతున్నాం అని 

టిఆర్ఎస్ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి

టిఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్ తెలిపారు.

Share it:

Post A Comment: