CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

2022 జనవరి నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి అనుదీప్ తెలిపారు.

Share it:

 


మన్యం టీవీ కొత్తగూడెం, ఆగస్టు7 :-

కేంద్ర ఎన్నికల సంఘం నూతన ఓటర్లుగా నమోదుకు కల్పించిన అవకాశాన్ని జనవరి 1, 2022 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.నూతన ఓటర్ల నమోదు తోపాటు సవరణలకు సంబంధించి http://www.nvsp.in వెబ్సైట్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సూచించారు. బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటికి తిరిగి ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఓటరుగా నమోదు చేసుకున్నట్లయితే గుర్తించాలని ఎన్నికల సంఘం సూచించినట్లు ఆయన తెలిపారు.ఈ ప్రక్రియ ఈ నెల 9వ తేదీ నుంచి వచ్చే అక్టోబర్ 31 వరకు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఈ ప్రక్రియ తదుపరి ముసాయిదా ఓటరు జాబితాను నవంబర్ 1వ తేదీన ప్రచురించడం జరుగుతుందని, అభ్యంతరాలు దాఖలు చేయడానికి నవంబర్ 30వ తేదీ వరకు ఎన్నికల సంగం అవకాశం కల్పించినట్లు ఆయన తెలిపారు.డిసెంబర్ 20వ తేదీ నాటికి ఈ సవరణలు ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించినట్లు ఆయన తెలియజేశారు.ఓటర్ల తుది జాబితాను జనవరి 5, 2022న కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Share it:

Post A Comment: